స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs శామ్సంగ్ గెలాక్సీ A 9
కెమేరాల పరంగా గొప్పగా ఉండే ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చిచూద్దాం .
హానర్ వ్యూ 20, ఒక 48MP సెన్సారుతో ఉన్న ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇది సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో ఒక పంచ్ హోల్ ను కలిగివుండేలా, చైనీస్ కంపెనీచే చేయబడిన మొదటి పరికరం. ఈ ఫోన్, భారతదేశంలో రూ .37,999 ధరతో ఉంది మరియు దీనిని అమెజాన్ ద్వారా రేపు విక్రయించనుంది. మరొక వైపు, మేనము శామ్సంగ్ గెలాక్సీ A9 కలిగివున్నాము, ఇది వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్ తో ప్రపంచంలోనే మొదటి ఫోన్. ఇది గత ఏడాది భారతదేశంలో రూ. 33,990 ధరతో విడుదలైనది . కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెక్స్ సరిపోల్చడం ద్వారా, వీటిలో హార్డ్వేర్ పరంగా మీకు సరైన దానిని మీరే ఎంచుకోవచ్చు.
హానర్ వ్యూ 20 1080 x 2310 పిక్సెళ్లతో, ఒక 6.39 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది, ఇక శామ్సంగ్ గెలాక్సీ ఏ 9, 1080 x 2280 పిక్సెళ్లతో కూడిన ఒక చిన్న 6.3-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, హానర్ వ్యూ 20 కిరిన్ 980 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతచేయబడింది, ఇందులో మెమోరిని పెంచుకునే అవకాశంలేదు. మరోవైపు, శామ్సంగ్ గెలాక్సీ A9 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు.
కెమెరాల విభాగానికి వస్తే, హానర్ వ్యూ 20, వెనుక 48MP + TOF 3D కెమెరా మరియు ముందు వెనుక 25MP సెన్సారుతో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ A9 యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా దాని వెనుక కెమెరాల గురించి చెప్పవచ్చు. ఇది ముందు 24MP యూనిట్ మరియు వెనుక 24MP + 10MP + 8MP + 5MP రియర్ క్వాడ్ కెమెరాతో ఏర్పాటు చేయబడిన ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్. ఏది ఏమయినప్పటికీ, నాలుగు కెమెరాలతో సామ్సంగ్ గెలాక్సీ ఎ 9 కెమెరాలు వ్యూ 20 కెమేరాల కంటే అంత మెరుగైనవి కావు. హానర్ వ్యూ 20 ఎన్నో ఇతర అంశాలని కలిగి ఉంటాయి.
అమెజాన్ ద్వారా జనవరి 30 న హనర్ వ్యూ 20 సేల్ కి అందుబాటులో ఉంటుంది, శామ్సంగ్ గెలాక్సీ A9 అమెజాన్లో 33,990 రూపాయలకు లభిస్తుంది.