స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs శామ్సంగ్ గెలాక్సీ A8s

Updated on 30-Jan-2019
HIGHLIGHTS

డిస్ప్లేలో ఒక పంచ్ హోల్ కెమేరా మరియు కెమెరా సెంట్రిక్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

హానర్ వ్యూ 20 వెనుకవైపు 48MP కెమెరాని కలిగి ఉన్న చైనీస్ కంపెనీ యొక్క మొదటి స్మార్ట్ ఫోన్ . ఈ ఫోన్ ఒక సెల్ఫీ కెమెరా కోసం ముందు తొలిచిన ఒక పంచ్ హోల్ ఉంది, ఇది వారి ఫోన్లలో సినిమాలు చూడటం లేదా బ్లాగులు చదవడానికి ఇష్టపడేవారి కోసం దాదాపు బెజెల్స్-తక్కువ మరియు ఐడియల్ గా చేస్తుంది. మరొక వైపు, శామ్సంగ్ గెలాక్సీ A8s కూడా దాదాపుగా వ్యూ 20 వంటి రూపకల్పనను పోలి ఉంటుంది. ఈ ఫోన్ ఒక సెల్ఫీ  కెమెరా ముందు పంచ్ హోల్ కట్ అవుట్  మరియు ఒక ట్రిపుల్ కెమెరా సెటప్  ఉంది. ఇక వీటి హార్డ్వేర్ విషయానికి వస్తే, వీటిలో ఈ స్మార్ట్ ఫోన్ బాగా ఉందో తెలుసుకోవడానికి ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ ను సరిపోల్చి చూద్దాం.

మీరు పైన షీట్లో చూడగలిగినట్లుగా, హానర్ వ్యూ 20, 1080 x 2310 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను కలిగి ఉన్న ఒక 6.39-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఈ శామ్సంగ్ గెలాక్సీ A8s 1080 x 2340 పిక్సెళ్ళు యొక్క రిజల్యూషన్ను అందించే కొంచెం పెద్దదైన ఒక 6.4 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది.

వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, హనర్ వ్యూ 20 కిరిన్ 980 ఆక్టా -కోర్ ప్రాసెసర్, 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో వస్తుంది, ఇందులో మెమొరీ    విస్తరించే అవకాశంలేదు. మరోవైపు,శామ్సంగ్ గెలాక్సీ A8s క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా -కోర్ ప్రాసెసరుతో,  6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జత చేయబడ్డాయి, దీనిని ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు.

కెమెరాలకు సంబంధించినంతవరకు, హానర్ వ్యూ 20 వెనుకవైపు 48MP కెమెరాను కలిగి ఉంటుంది, ఇది ఒక TOF 3D కెమెరాతో ఉంటుంది. ముందు, ఒక 25MP సెన్సార్ను కలిగి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ A8s ఒక 24MP + 10MP + 5MP  ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు 24MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది.

హానర్ వ్యూ 20 ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా ఈ రోజు అమ్మకానికి ఉండనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% తగ్గింపు కూడా పొందవచ్చు. మరోవైపు, త్వరలో శామ్సంగ్ గెలాక్సీ A8s ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :