స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs వన్ ప్లస్ 6T

స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs వన్ ప్లస్ 6T
HIGHLIGHTS

భారతదేశంలో, హానర్ వ్యూ 20 అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో, అమెజాన్ ఇండియా ద్వారా  కొనుగోలు చేయడానికి హానర్ వ్యూ 20 త్వరలో అందుబాటులో ఉంటుంది. ఈ e-కామర్స్ ప్లాట్ఫారం,  ప్రస్తుతం ముందస్తు బుకింగుల కోసం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ వెబ్ సైట్ కూడా సేల్ కంటే ముందుగా ప్రీ-బుకింగ్ చేసిన వారికీ, రూ. 2,999 విలువగల హెడ్ ఫోన్లను ఉచితంగా అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొత్త కిరిన్ 980 ప్రాసెసరుతో పాటుగా 48MP AI- ఆధారిత వెనుక కెమెరాతో వస్తుంది. మరొక వైపు, డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్  సెన్సార్ మరియు ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ తో గత సంవత్సరం ప్రారంభించబడిన OnePlus 6T ఉంటుంది. వాటి ఆన్ పేపర్ పైన అందించిన వివరాల ప్రకారం, ఏది ఉత్తమ స్మార్ట్ ఫోనుగా ఉండనుందో తెలుసుకోవడానికి ఈ రెండు ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

View 20 vs OnePlus 6T.png

1080 x 2310 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.39-అంగుళాల పూర్తి HD + ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఈ హువావే వ్యూ 20 ఉంటుంది. దాదాపు సమీప-బెజెల్స్ లేనివిధంగా మీకు 91.8%  స్క్రీన్ నుండి బాడీ నిష్పత్తితో మరింత స్క్రీన్ ఇస్తుంది. ఈ ఫోన్ ఒక పంచ్-హోల్ కట్ తో వస్తుంది కాబట్టి, ఇందులో నోచ్  పూర్తిగా తెలియకుండా చేస్తుంది.  ఒక సెల్ఫీ కెమెరా కోసం ముందు ఒక పంచ్ హోల్ తో వస్తుంది. మరొక వైపు, వన్ ప్లస్ 6T 1080 x 2340 పిక్సెల్స్ తో  మెరుగైన రిజల్యూషన్ అందించే కొద్దిగా పెద్దధైన ఒక 6.4 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే పై భగంలో వాటర్ డ్రాప్ నోచ్ ఉంటుంది, ఇది ముందు భాగంలోని కెమెరాని కలిగివుంటుంది.

వీటి  ప్రాసెసర్ విషయానికి వస్తే, హువావే వ్యూ 20 స్మార్ట్ ఫోన్ ఒక తాజా కిరిన్ 978 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఇది 8GB RAM మరియు 256GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసరుతో ఈ OnePlus 6T మద్దతు ఇస్తుంది, ఇంకా ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జత చేయబడుతుంది మరియు ఇందులో మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరాలకి సంబంధించినంతవరకు, వ్యూ 20 డ్యూయల్ NPU చిప్సెట్తో వచ్చిన 48MP AI-పవర్డ్ వెనుక కెమెరాను కలిగి ఉంది, ఇది రియల్ టైములో వందకొద్దీ  కేటగిరీలను గుర్తించి, నిమిషానికి 4500 చిత్రాల వరకూ ప్రాసెస్ చేయగలదు. ఈ 48MP సెన్సార్ TOF 3D సెన్సారుతో కలిసి ఉంటుంది. ముందు, ఈ ఫోన్ 25MP యూనిట్ కలిగి ఉంది. ఇక వన్ ప్లస్ 6T విషయానికి వచ్చినప్పుడు, ఇది ముందుభాగంలో ఒక 16MP కెమెరాతో పాటు డ్యూయల్ 16MP + 20MP వెనుక కెమెరాతో ఉంటుంది.

OnePlus 6T భారతదేశంలో రూ .37,999 ధరకు లభ్యమవుతుంది. అయితే, జనవరి 15 నుంచి అమెజాన్ ద్వారా Huawei View 20 ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo