ప్రత్యేకతల పోలిక : Honor 8X Vs Honor Play
ఈ శీర్షికలో మనం, హానర్ 8X ఫోన్ ని హానర్ ప్లే తో పోల్చిచూడబోతున్నాము, వాటి లక్షణాలు మరియు ప్రత్యేకతల పరంగా అవి ఎలానిలబడతాయో చూద్దాం!
హువావే, ఈ సంవత్సరంలో దాదాపు ప్రతీ ధరపరిధిలో చాలా ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో ఉన్నతమైన స్పెక్స్ మరియు బడ్జెట్ ధరలో వచ్చిన హానర్ 8X ఫోన్ ని మధ్య స్థాయి ధర ఫోన్ అయిన హానర్ ప్లే తో పోల్చిచూద్దాం. ఈ హానర్ ప్లే కిరిణ్ 970 ప్రాసెసర్ కలిగి Rs. 19,999 ధరతో వచ్చింది, అయితే హానర్ 8X కిరిణ్ 710 ప్రాసెసర్ కలిగి Rs. 14,999 ధరని కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ధరల మద్య 5,000 రూపాయల వ్యత్యాసముండగా, వాటి స్పెక్స్ మద్య తేడాలేమిటో చూద్దాం. వీటి స్పెక్స్ ఈ కింద గమనించవచ్చు.
Products |
||
Launch price |
Rs 14,999 |
Rs 19,999 |
Display |
6.5-inch |
6.3-inch |
Resolution |
1080 x 2340 pixels |
1080 x 2340 pixels |
Processor make |
HiSilicon Kirin 710 |
HiSilicon Kirin 970 |
Processor |
2.2GHz octa-core |
2.36GHz |
RAM |
4GB |
4GB |
Internal storage |
64GB |
64GB |
Expandable storage |
256GB |
256GB |
Rear camera |
20MP + 2MP |
16MP + 2MP |
Front camera |
16MP |
16MP |
Rear Flash |
Yes |
Yes |
Android version |
8.1 Oreo |
8.1 Oreo |
ముందుగా ఈ రేడు ఫోన్ల డిస్ప్లే లతో మొదలుపెడితే, హానర్ 8X ఫోన్ 1080×2340 పిక్సెల్స్ అందించగల ఒక 6.5 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటే, ఈ హానర్ ప్లే అదేవిధమైన పిక్సెల్స్ తో ఒక 6.3 అంగుళాల డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ విభాగంలో హానర్ 8X ఫోన్ యొక్క డిస్ప్లే హానర్ ప్లే కంటే కొంచం పెద్దగా ఉంటుంది. పెద్ద స్క్రీన్ తో ఒక ఫోన్ ని మీరు కోరుకుంటే, వారికీ హానర్ 8X ఎంపికగా ఉండవచ్చు.
పనితనం గురించి చుస్తే, హానర్ 8X కిరిణ్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రూపొందించబడింది, అయితే హానర్ ప్లే కిరిణ్ 970 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అంటే, హానర్ ప్లే ఫోన్ కంపెనీ యొక్క ప్రధాన ప్రాసెసర్ తో, ఈ హానర్ 8X కంటే మెరుగైన ప్రాసెసర్ కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఈ సౌలభ్యం కోసం హానర్ 8X కంటే 5000 రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సివుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సివుంటుంది.
కెమేరా విభాగంలో, హానర్ 8X 20MP +2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. మరొకవైపు, ఈ హానర్ ప్లే 16MP+2MP డ్యూయల్ రియర్ కేమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో, హానర్ 8X మరియు హానర్ ప్లే రెండు ఫోన్లు కూడా 16MP సెన్సర్తో వస్తాయి. అయితే, కెమెరా విభాగంలో ఈ హానర్ 8X మంచి కెమెరా ప్రత్యేకతలతో వస్తుంది, కానీ మెగాపిక్సెల్స్ ఆధారంగా కెమేరా యొక్క క్వాలిటీని అంచనావేయలేము.
చివరిగా, హానర్ ప్లే దాని యొక్క ప్రాసెసర్ పరంగా గొప్పగా ఉంటుంది, కానీ హానర్ 8X ని కూడా ప్రాసెసర్ పరంగా తక్కువగా అంచనావేయడానికి వీలులేదు. ఇది కేవలం, మీ వాడుక మీద ఆధారపడి మీకు ఏది కావాలో ఎంచుకునే దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
అమేజాన్ నుండి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు
Honor 8X ధర – Rs . 14,999
Honor Play – Rs . 19,999