ఈ హానర్ 8C డ్యూయల్ వెనుక కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసరుతో భారతదేశంలో విడుదలైనది. ఈ స్మార్ట్ఫోన్ను సంస్థ నుండి విడుదలైన తాజా మధ్యస్థాయి పరికరంగా భావిస్తున్నారు. మరొక వైపు, హానర్ ప్లే, 2018 ఆగష్టులో హువాయ్ యొక్క ఉప-బ్రాండ్ హానర్ ప్రారంభించింది, దీని యొక్క 4GB వేరియంట్ ధర రూ . 19,999 రూపాయలు. ఈ రెండు స్మార్ట్ఫోన్లను పోల్చి చూద్దాం.
ముందుగా, ఈ రెండు ఫోన్ల డిస్ప్లేలను పోల్చడంతో ప్రారంభిద్దాం. ఈ హానర్ 8C ఒక 6.2-అంగుళాల డిస్ప్లేని 720 x 1550 పిక్సెల్స్ యొక్క రిజల్యూషనుతో అందిస్తుంది. మరోపైపున, హానర్ ప్లే పైన ఉన్న షీట్లో చూడగలిగే విధంగా మెరుగైన ఒక 6.3-అంగుళాల FHD + డిస్ప్లే, హానర్ 8C కంటే మంచి రిజల్యూషన్ అందిస్తుంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, హానర్ 8C క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో శక్తినిస్తుంది, అయితే హువావే యొక్క కిరిణ్ 970 ప్రాసెసరుతో హానర్ ప్లే వస్తుంది.
కెమెరాలకి విభాగంలో, ఇవి మార్కెట్లో దాదాపు ప్రతి ఒక్క పరికరంలాగానే ఈ రెండు పరికరాలకు కూడా వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. హానర్ 8C ఒక డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు ముందు 8MP కెమేరాతో వస్తుంది. మరొక వైపు, హానర్ ప్లే ముందు ఒక 16MP సెన్సార్ మరియు డ్యూయల్ 16MP + 2MP వెనుక కెమెరాతో వస్తుంది.
హానర్ 8C ఇండియాలో రూ .11,999 ప్రారంభ ధరతో విడుదలైనది, అయితే రూ .19,999 ధరతో ఈ హానర్ ప్లే ను పొందవచ్చు.