స్పెక్స్ సరిపోలిక : హానర్ 10 లైట్ vs షావోమి రెడ్మి నోట్ 6 ప్రో
కెమేరాల పరంగా అలరించే ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో, హార్డ్ వేర్ పరంగా ఏది గొప్పగా ఉంటుందో సరిపోల్చి చూద్దాం.
కిరిణ్ 710 చిప్సెట్ మరియు 24MP ఫ్రంట్ కెమెరాతో హానర్ 10 లైట్ భారతదేశంలో ప్రారంభించబడింది. దీని యొక్క 4GB / 64GB వేరియంట్ రూ. 13,999 ధరతో లభిస్తుంది. మరొక వైపు, Xiaomi Redmi Note 6 ప్రో కలిగివున్నాము, ఇది ముందు మరియు వెనుక రెండు వైపులా కూడా డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి వచ్చిన షావోమి సంస్థ యొక్క మొదటి డివైజ్ . ఈ ఫోన్ ప్రస్తుతం భారతదేశంలో mi.com నుండి రూ .13,999 ధరతో అందుబాటులో ఉంది. కాబట్టి, హార్డ్వేర్ విషయానికి వస్తే ఏ పరికరం ఉత్తమంగా ఉందో తెలుసుకోవడానికి వాటి స్పెక్స్ సరిపోల్చి చూద్దాం.
1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ అందించే ఒక 6.21 అంగుళాల FHD + డిస్ప్లేను హానర్ 10 లైట్ అందిస్తుంది. Xiaomi Redmi Note 6 Pro 1080 x 2280 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ అందించే కొద్దిగా పెద్దదైన ఒక 6.26-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
ఇక ప్రాసెసర్ల విషయానికి వచ్చినప్పుడు, హానర్ 10 లైట్ ఒక కిరిన్ 710 చిప్సెట్ శక్తిని కలిగి ఉంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ను కలిగి ఉంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది.
కెమెరాలకు సంబంధించి, హానర్ 10 లైట్ ముందు 24MP కెమెరా మరియు వెనుక డ్యూయల్ 13MP + 2MP కెమెరాలు కలిగి ఉంది. మరో వైపు, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ముందు డ్యూయల్ 20MP + 2MP కెమెరా పాటు వెనుక కూడా డ్యూయల్ 12MP + 5MP కెమెరాను కలిగి ఉంది.
షావోమి రెడ్మి నోట్ 6 ప్రో mi.com నుండి 13,999 రూపాయలకు లభిస్తుంది, ఈ హానర్ 10 లైట్ కూడా ఇదే రూ. 13,999 ధరకు లభిస్తుంది.