హానర్ 10 లైట్ ఇప్పుడు 24MP AI ఆధారిత సెల్ఫీ కెమెరా మరియు కిరిన్ 710 ప్రాసెసరుతో భారతదేశంలో ప్రారంభించబడింది. ముందుగా, నవంబర్ లో ఈ ఫోన్ను CNY 1,399 తో చైనాలో ప్రారంభించారు. భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,999 గా నిర్ణయించబడయింది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలను, Flipkart మరియు హానర్ అధికారిక వెబ్సైట్ ద్వారా చేపట్టనున్నారు. ఇంకొక వైపు, మనకు 25MP AI- ఆధారిత సెల్ఫీ కెమెరా మరియు డిస్ప్లే పైభాగంలో ఒక డ్యూ డ్రాప్ నోచ్ తో వుండే RealMe U1 ఉంది. దాని అంతరంగా, మెరుగైన హార్డ్ వేర్ ను ఏ డివైజ్ అందిస్తుందో చూసేందుకు, ఈ రెండింటి స్పెక్స్ సరిపోల్చి చూద్దాం.
ఈ హానర్ 10 లైట్, 1080 x 2340 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.21-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరొక వైపు, రియల్మి U1 2340 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ తో కొద్దిగా పెద్దదైన ఒక 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ ఫోనులు వాటి డిస్ప్లే పైన ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తాయి, ముందు భాగంలోని ఈ నోచ్ లో కెమెరాని కలిగివుంటాయి.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, హానర్ 10 లైట్ ఫోన్ ఒక కిరిన్ 710 ఆక్టా -కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది , ఇది 2.2GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. రియల్మి U1 ఒక మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో ఉంటుంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు దీని మెమొరీని పెంచుకోవచ్చు.
కెమెరా విభాగంలో, హానర్ 10 లైట్ మరియు రియల్మి U1 రెండూ కూడా వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమెరా కలిగివున్నాయి. ముందు, హానర్ 10 లైట్ 24MP AI- ఆధారిత సెల్ఫీ కెమెరా కలిగివుంది, అయితే రియల్మి U1 ముందు ఒక 25MP సెన్సార్ కలిగివుంది.
అమెజాన్ నుండి 14,499 రూపాయలకు RealMe U1 ను కొనుగోలుచేయవచ్చు, హానర్ 10 లైట్ Flipkart లో జనవరి 20 నుండి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.