ఇటీవలే, హానర్ 10 లైట్ భారతదేశంలో ప్రారంభించబడి, ఇది రూ. 13,999 ధరతో ఉంది. ఈ ఫోన్, కిరిన్ 710 చిప్సెట్టుతో ఒక 6.21 FHD + డిస్ప్లేని కలిగివుంది. ఇంకొక వైపు, మనకు ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఉంది, ఇది ఒక 6.26-అంగుళాల FHD + డిస్ప్లేతో వస్తుంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసరుతో వస్తుంది. కాబట్టి, హార్డ్వేర్ విషయానికి వస్తే ఏది ఉత్తమమైనదిగా ఉంటుందో తెలుసువడానికి పూర్తి స్పెసిఫికేషన్లను సరిపోల్చి చూద్దాం.
పైన తెలిపిన విధంగా, హానర్ 10 లైట్ 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే, ఒక 6.21-అంగుళాల FHD + డిస్ప్లే తో వస్తుంది. మరొక వైపు, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 1080 x 2280 పిక్సెల్స్ ఒక రిజల్యూషన్ను అందించే, కొద్దిగా పెద్దదైన ఒక 6.26-అంగుళాల డిస్ప్లే కలిగివుంటుంది.
వాటి ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ హానర్ 10 లైట్ ఒక కిరణ్ 710 చిప్సెట్ చేత శక్తినిస్తే, ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జత చెయ్యబడింది. ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా హానర్ 10 లైట్ వంటి అదే, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో ప్యాక్ చెయ్యబడింది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, హానర్ 10 లైట్ వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమెరా మరియు ముందు 24MP సెన్సార్ ఏర్పాటుతో చేయబడింది. అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా ముందు ఒక 13MP యూనిట్ తో వస్తుంది మరియు వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరాని కలిగివుంది.
హానర్ 10 లైట్ ఇండియాలో రూ. 13,999 ధరతో అందుబాటులో ఉంటుంది. అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 యొక్క 4GB వేరియంట్ రూ .14,999 ధరతో పొందవచ్చు.