స్పెసిఫికేషన్స్ సరిపోలిక :అసూస్ రోగ్ vs హువావే మేట్ 20 ప్రో
ఒకటేమో గేమింగ్ బీస్ట్, మరొకటి కెమేరా బీస్ట్ కాబట్టి సరిపోల్చి చూద్దాం.
అసూస్ తన గేమింగ్ స్మార్ట్ ఫోన్ "అసూస్ రోగ్" ను జులైలో జరిగిన కంప్యూటెక్ 2018 లో ప్రకటించింది. ఈ గురువారం భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ AMOLED డిస్ప్లేతో మరియు 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇంకొక వైపు, హువావే మేట్ 20 ప్రో, వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్తో విడుదలైంది. దీని ధర రూ .69,990. దాని లోపల ఒక మంచి హార్డ్వేర్ను సిద్ధం చేసుకున్నఈ రెండు ఫ్లాగ్ షిప్ పరికరాలను, స్పెసిఫికేషన్ల సరిపోలికతో ప్రారంభిద్దాం.
అసూస్ రోగ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఒక 6.0-అంగుళాల డిస్ప్లేని 1080 x 2160 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో అందిస్తుంది. ఇంకొక వైపు, ఒక పెద్ద 6.39-అంగుళాల డిస్ప్లేతో లభించే హువావే మేట్ 20 ప్రో 1440 x 3120 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది.
ఇక వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, అసూస్ రోగ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ శక్తితో వస్తుంది, అదే సమయంలో హువావే మేట్ 20 ప్రో, కిరిణ్ 980 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మద్దతునిస్తుంది.
కెమెరాలకు సంబంధించి, 24MP ముందు సెన్సారు మరియు వెనుకవైపు ఏర్పాటు చేసిన ట్రిపుల్ 40MP + 20MP + 8MP కెమెరాతో వచ్చిన హువావే మేట్ 20 ప్రో, ముఖ్యంగా దాని యొక్క కెమెరాలు హైలైట్ గా ఉంటాయి. ఇంకొక వైపు, అసూస్ రోగ్ ముందు ఒక 8MP సెన్సార్ మరియు వెనుక ఒక సింగిల్ 12MP యూనిట్ను కలిగి ఉంది.
ప్రత్యేకంగా గేమర్స్ కోసం రూపొందించబడిన అసూస్ రోగ్ పూర్తిగా భిన్నమైన పరికరం. ఈ ఫోన్ వారి వారి స్మార్ట్ ఫోన్లలో, ఎక్కువగా ఆటలను ఆడేవారికి ఆదర్శంగా ఉంటుంది. ఇంకొక వైపు, మీరు ఒక పెద్ద డిస్ప్లే మరియు మెరుగైన కెమెరాలతో ఉన్న ఒక పరికరం కోసం చూస్తున్నట్లయితే, ఈ హువావే మేట్ 20 ప్రో సరిగ్గా సరిపోతుంది.
హువావే మేట్ 20 ప్రో ఇండియాలో రూ .69,990 ధరకే విడుదల చేయబడింది. అదే సమయంలో లేటెస్ట్ అసూస్ రోగ్ రూ. 69,999 ధరతో విడుదలైనది.