స్పెసిఫికేషన్స్ సరిపోలిక : రియల్మీ U1vs హానర్ 8C
ఇటీవలే విడుదలై అమ్మకానికి సిద్దమవుతున్న ఈ రెండు ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
రియల్మీ యొక్క U సిరీస్లో నుండి వచ్చిన మొట్టమొదటి ఫోన్ రియల్మీU1, ఇది మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వస్తుంది మరియు ఈ ప్రాసెసరుతో వచ్చిన మొట్టమొదటి ఫోనుకూడ ఈ "రియల్మీ U1". దీని 3 GB / 32 GB వేరియంట్ యొక్క ధర రూ .11,999. మరొకవైపున, హానర్ 8C ని చుస్తే, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో వస్తుంది మరియు ఈ ఫోనుకూడా రూ. 11,999 ధరకే లభిస్తుంది. కాబట్టి, ఈ రెండు ఫోన్లలో సరైన స్పెక్స్ తెలుకోవడానికి వీలుగా, వీటిని సరిపోల్చి చూద్దాం.
రియల్మీ U1 ఒక 6.3-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది, అయితే హానర్ 8C, 720 x 1520 పిక్సల్స్ యొక్కరిజల్యూషన్ అందించే కొద్దిగా చిన్నదైన ఒక 6.2-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. డిస్ప్లే పరంగా, పేపర్ పైన కనిపించే విధంగా చుస్తే రియల్మీ U1 హానర్ 8C కంటే కొంచెం పెద్దదిగా మరియు మెరుగైన డిస్ప్లే కలిగివుంది.
ప్రాసెసర్ విషయానికి వచ్చినప్పుడు, ఈ రియల్మీ U1 ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంటుంది, అలాగే ఈ హానర్ 8C క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది.
కెమెరా విభాగానికివస్తే, ఈ రియల్మీ U1 డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు 25MP ముందు కెమెరా కలిగి ఉంది. హానర్ 8C వెనుకవైపు ఒక డ్యూయల్ 13MP + 2MP కెమెరా సెటప్ మరియు 8MP ముందు కెమేరాతో అమర్చబడి ఉంటుంది.
రియల్మీ U1 మరియు హానర్ 8C రెండూ కూడా భారతదేశంలో రూ .11,999 ధరతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ నుండి డిసెంబర్ 10న ఈ హానర్ 8C అందుబాటులో ఉంటుంది మరియు అదేతేది అయిన డిసెంబర్ 5 న అమెజాన్ నుండి మీకు RealMe U1 కూడా అందుబాటులో ఉంటుంది.