స్పెక్స్ సరిపోలిక :షావోమి రెడ్మి 6 ప్రో vs నోకియా 6.1 ప్లస్

Updated on 04-Jan-2019
HIGHLIGHTS

ఈ రెండు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో, హార్డ్ వేర్ పరంగా ఏది గొప్పగా ఉంటుందో తెలుసుకోవడానికి, వీటిని సరిపోల్చి చూద్దాం.

నోకియా 6.1 ప్లస్ Google యొక్క Android One ప్రోగ్రాములో భాగంగా ఉంటుంది. అనగా ఇది Google నుండి నేరుగా అప్డేట్లను అందుకుంటుంది మరియు ఏ విషయంలో, ఇతర పరికరాల కంటే ముందుగా ఉంటుంది. ఇది వెనుక ఒక డ్యూయల్ కెమెరాతో, డిస్ప్లే పైన ఒక నోచ్ తో ఉంది. మరోవైపు, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  625 ప్రాసెసరుతో వస్తుంది ఈ షావోమి రెడ్మి 6 ప్రో. అంతేకాకుండా, ఒక డ్యూయల్  వెనుక కెమెరా కూడా కలిగివుంది. ఒక పరిమిత బడ్జెట్లో, కొనుగోలు చేయడానికి ఏది సరైనదనే విషయాన్నీ తెలుసుకోవటానికి స్పెక్స్ సరిపోల్చి చూద్దామా?

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లే గురించి వివరంగా పోల్చడం ప్రారంభిద్దాం. షావోమి రెడ్మి6 ప్రో ఒక 5.80 అంగుళాల డిస్ప్లేని 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషనుతో కలిగివుంటుంది. మరొకవైపు, నోకియా 6.1 ప్లస్ కూడా అటువంటిదే, ఒక 5.8 అంగుళాల డిస్ప్లే, 1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషనుతో కలిగి ఉంటుంది.

వీటి  పనితీరు విషయానికి వచ్చినప్పుడు, నోకియా 6.1 ప్లస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ చేత శక్తిని ఇస్తుంది మరియు ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  625 చిప్సెట్ కలిగివున్న షావోమి రెడ్మి 6 ప్రో కంటే వేగంగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోనులు కూడా 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో ప్యా చేయబడ్డాయి. మైక్రో SD కార్డ్ ద్వారా నోకియా 6.1 ప్లస్ యొక్క అంతర్గత స్టోరేజిని 400GB వరకు విస్తరించవచ్చు, అయితే షావోమి రెడ్మి 6 ప్రో ని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు.

కెమెరాలకు సంబంధించి, షావోమి రెడ్మి 6 ప్రో ముందు 5MP యూనిట్ మరియు వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరాలని కలిగివుంది. మరోవైపు, నోకియా 6.1 ప్లస్ ముందువైపు 16MP సెన్సారుతో పాటుగా వెనుకవైపు 16MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్పుతో వస్తుంది.  విషయంలో కూడా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోను పైచేయిగా నిలుస్తుంది.  

ఇంకా చివరిగా వీటి ధరల విషయానికి వస్తే, షావోమి రెడ్మి 6 ప్రో రూ .12,999 ధరతో ఉంది. అలాగే,  నోకియా 6.1 ప్లస్ రూ .15,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుండి  కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :