స్పెసిఫికేషన్స్ కంపారిజన్ : రియల్మీ 2 vs రియల్మీ 2 ప్రో

Updated on 28-Nov-2018
HIGHLIGHTS

రియల్మీ 2 ప్రో, సరిచేయడిన కెమేరాలు మరియు డ్యూ డ్రాప్ నోచ్ కలిగి ఇటీవలే విడుదలైనది.

ఈ రియల్మీ 2 ప్రో 4GB / 64GB మరియు 6GB / 64GB వంటి రెండు రకాల్లో అందుబాటులో ఉంది. ఈ సామ్రాట్ ఫోన్ కూడా డిస్ప్లే పైన ఒక నోచ్ కలిగి మరియు ఒక 19: 9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. మరొక వైపు, రియల్మీ 2  రూ 9,490 ధర వద్ద,  ఒక డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది . దీని యొక్క అప్గ్రేడ్ ఫోనుకు   మీరు చెల్లించే డబ్బుకు, తగిన విలువ ఇస్తుందో లేక ఇవ్వదో చూడటానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఇక్కడ సరిపోలుస్తున్నాము. 

రియల్మీ 2, ఒక 6.2-అంగుళాల డిస్ప్లేని 720 x 1520 పిక్సల్స్ రిజల్యూషనుతో కలిగివుంటుంది. మరొక వైపు, రియల్మీ 2 ప్రో 1080 x 2340 పిక్సల్స్ రిజల్యూషనుతో,  కొద్దిగా పెద్దదైన  ఒక 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.

వీటి ప్రాసెసరు విషయానికి వచ్చినప్పుడు, ఈ రియల్మీ 2 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ఆక్టా – కోర్ ప్రాసెసర్, 3 జీబి ర్యామ్ మరియు 32 జీబి ఇంటర్నల్ మెమరీతో జత చేయబడింది. మరోవైపు, రియల్మీ2 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ఆక్టా – కోర్ ప్రాసెసరుతో వస్తుంది.

ఇక కెమెరా విభాగంలో,  ఈ రియల్మీ 2 డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు ముందు 8MP కెమేరాతో ఉంటుంది. అలాగే, రియల్మీ 2 ప్రో ఒక డ్యూయల్ 16MP + 2MP వెనుక కెమెరా మరియు ముందు 16MP సెన్సారుతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :