Xperia XZ2 స్మార్ట్ ఫోన్ బెజెల్ లెస్ డిసైన్ తో…..
By
Santhoshi |
Updated on 19-Dec-2017
ఇటీవల సోనీఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Xperia XZ2 యొక్క ఇమేజ్ లీక్ అయ్యింది , Xperia XZ2 స్మార్ట్ఫోన్ల మూడు వైపులా Xiaomi మి మిక్స్ 2 వంటి బెజల్-లెస్‌గా భావిస్తున్నారు. ఫోన్ లో పవర్ బటన్ సైడ్ న ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్ మరియు కెమెరా బటన్లు కుడి వైపున ఉంటాయి. స్పీకర్ మరియు ఇయర్ పీస్ ఫోన్ పైన ఉంటుంది.
ఈ పరికరానికి 5.5 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది 4GB RAM మరియు 64 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. Qualcomm యొక్క తాజా స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ ఉంటుంది. ఈ ఇమేజ్ అధికారిక ప్రకటన చేయబడే వరకు, అది పూర్తిగా విశ్వసించబడదు.