Sony Xperia XA1 Ultra స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ చేయబడింది . భారత్ మార్కెట్ లో ఈ డివైస్ ధర Rs 29,990 గా వుంది . ఇది సోనీ సెంటర్ అండ్ మిగతా స్టోర్స్ లో కూడా లభ్యం . ఈ ఫోన్ బ్లాక్ వైట్ అండ్ గోల్డ్ కలర్స్ లో కలదు .
దీనితో పాటుగా కంపెనీ ఎన్ని ఆఫర్స్ కూడా ఇస్తుంది . ఈ డివైస్ తో పాటుగా యూజర్ కి Rs 1,490 ధర గల క్విక్ చార్జర్ లభిస్తుంది . మరియు Sony LIV యాప్ 3 మంత్స్ సభ్యత్వం ఫ్రీ .
Sony Xperia XA1 Ultra ఫీచర్స్ చూస్తే దీనిలో 6- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . పిక్సల్ డెన్సిటీ 367ppi అండ్ 2.3GHz ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో P20 64- బిట్ ప్రోసెసర్ అండ్ మాలి -T880 MP2 GPU మరియు 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా 256GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .
Sony Xperia XA1 Ultra లో 23MP రేర్ కెమెరా హై బ్రిడ్ ఆటో ఫోకస్ అండ్ LED ఫ్లాష్ మరియు దీనిలో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . ఈ 4G LTE స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . ఇది 2700mAh బ్యాటరీ కలిగి వుంది ఇది ఒక డ్యూయల్ సిం స్మార్ట్ ఫోన్ .