రూ. 24,990 లకు సోని ఎక్స్పిరియా M4 Aqua లాంచ్ అయ్యింది

రూ. 24,990 లకు సోని ఎక్స్పిరియా M4 Aqua లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

సోని ఎక్స్పిరియా M4 Aqua తో పాటు సేల్ఫీ కెమేరా ఎక్స్పిరియా c4 మోడల్ లాంచ్

సోనీ కంపెని కొంచెం విరామం తీసుకోని ఎక్స్పిరియా M4 Aqua మోడల్ ను 24,990 రూ. లకు అఫీషియల్ లాంచ్ చేసింది. మార్కెట్ లో ఈరోజు నుండి మీరు దీనిని కొనుకోవచ్చు. ధర ఇంకా నిర్ణయించని సేల్ఫీ స్మార్ట్ ఫోన్ C4 ను కూడా ఒకేసారి లాంచ్ చేసింది. c4 వచ్చే నెల నుండి మార్కెట్లో దొరకనుంది.

ఎప్పుడూ లానే, Aqua M4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ తో వస్తుంది.(IP65 మరియు IP68 సర్టిఫికేషన్). 5 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్ మరియు 2జిబి ర్యామ్ ఈ ఫోన్ లో జోడించారు. కెమేరా విషయానికి వస్తే, 13MP ఆటో ఫోకస్ వెనుక కెమేరా మరియు 5 MP ఫ్రంట్ కెమేరా దీనిలో ప్రధాన ఆకర్షణ. 8జిబి ఇంటర్నెల్ స్టోరేజి మరియు 2400 mah బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే, aGPS, బ్లూటూత్ 4.1, 3.5mm ఆడియో జ్యాక్, NFC, GLONASS, మీరా కాస్ట్, usb టేథర్, usb 2.0 మరియు usb సపోర్ట్, వైఫై , వైఫై హాట్ స్పాట్ ఉన్నాయి.

సోని ఎక్స్పిరియా c4 లో 5.5 అంగుళాల 1080P డిస్ప్లే ఉంది. కెమేరా Aqua M4 మాదిరిగానే 13 మరియు 5MP కెమెరాలతో వస్తుంది. 16జిబి ఇంటర్నెల్, 128జిబి ఎక్స్పాన్డబల్ స్టోరేజి ఉంది. మీడియా టెక్ MT6752 మరియు 2జిబి ర్యామ్ c4 లో జోడించారు. 2600 mah బ్యాటరీ తో రానుంది.  కనెక్టివిటీ విషయం లో అన్ని aqua M4 లానే ఉన్నాయి. ఎక్స్పిరియా c3 కి c4 తరువాతి మోడల్.
 

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo