52MP Exmor T భారీ కెమేరాతో Xperia 5 V ఫోన్ లాంచ్ చేసిన Sony.!

Updated on 01-Sep-2023
HIGHLIGHTS

Sony సరికొత్త స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది

Xperia 5 V స్మార్ట్ ఫోన్ ను 52MP Exmor T For Mobile సెన్సార్ తో లాంచ్ చేసింది

Sony Xperia 5 V అద్భుతమైన కెమేరా ఫీచర్స్ తో లాంచ్

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony సరికొత్త స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది. అదే, Xperia 5 V స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను Exmor T For Mobile సెన్సార్ మరియు Snapdragon 8 Gen 2 SoC తో లాంచ్ చేసింది. Sony Xperia 5 V అద్భుతమైన కెమేరా ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఆకట్టుకుంటోంది మరియు ఈ ఫోన్ లో మరిన్ని హంగులను Sony జత చేసింది. ఈ లేటెస్ట్ సోనీ విశేషాలు పైన ఒక లుక్కేద్దాం పదండి.

Xperia 5 V Specs

సోని కంపెనీ ఈ Xperia 5 V స్మార్ట్ ఫోన్ ను ప్రతిష్టాత్మకమైన స్పెక్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో అందించిన బెస్ట్ స్పెక్స్ మరియు ఫీచర్లను ఈ క్రింద చూడవచ్చు.    

Xperia 5 V Display

ఈ సోనీ స్మార్ట్ ఫోన్ ను 6.1 ఇంచ్ HDR OLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో అందించింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, CineAlta, 10-bit టోనల్ గ్రేడేషన్ మరియు X1 for మొబైల్ వంటి ఫీచర్ లతో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 తో స్ట్రాంగ్ గా ఉంటుంది. 

Xperia 5 V Performance

Sony Xperia 5 V స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. అంటే, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ దృశ్యా ఎటువంటి సంకోచాలకు తావివ్వక పోవచ్చు. 

Xperia 5 V Camera

ఈ విభాగంలో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుందని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో Sony కంపెనీ 52MP Exmor T For Mobile కెమేరా మరియు జతగా 12MP Exmor RS For Mobile సెన్సార్ లు కలిగిన డ్యూయల్ కెమేరా సెటప్ అందించింది. ఇది డ్యూయల్ కెమేరానే అయినా చాలా పవర్ ఫుల్ అని చెప్పవచ్చు. 

Xperia 5 V ఫోన్ 24mm, 48mm Focal Length సపోర్ట్ తో వస్తుంది. ఈ కెమేరాతో True Color ఫోటోలతో పాటుగా మరింత క్లియర్ ఇమేజెస్ ను పొందవచ్చు. 

Xperia 5 V ఫోన్ తో 4K HDR వీడియో లను 24, 25, 30, 60 మరియు 120fps వద్ద కూడా రికార్డ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అంటే, అత్యద్భుతమైన 4K HDR Video లను ఈ ఫోన్ చిత్రీకరించ గలదు. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ఫోన్ కెమేరా ఫీచర్ చాలా ఉన్నాయి. 

Xperia 5 V Battery

ఈసారి సోనీ ఈ ఎక్స్ పీరియా సిరీస్ ఫోన్ లో భారీ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది.      

Xperia 5 V Audio

ఈ ఫోన్ Hi- Res Audio, Dolby Atmos, 360 Reality Audio Upmix తో పాటు ఫుల్ స్టేజ్ స్టీరియో స్పీకర్లను కూడా అందించింది.         

Xperia 5 V Price

Xperia 5 V స్మార్ట్ ఫోన్ ను 999 Euros (సుమారు రూ. 89,700) ధరతో లాంచ్ చేసింది.

 

https://twitter.com/sonyxperia/status/1697521431142085060?ref_src=twsrc%5Etfw

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :