IFA 2018 లో సోనీ తన ఎక్స్పీరియా XZ3 ని ప్రవేశపెట్టింది : 18:9 OLED HDR డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఫై మరియు స్నాప్ డ్రాగన్ 845 తో ఆడంబరంగా

IFA 2018 లో సోనీ తన ఎక్స్పీరియా XZ3 ని ప్రవేశపెట్టింది : 18:9 OLED HDR డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఫై మరియు స్నాప్ డ్రాగన్ 845 తో ఆడంబరంగా
HIGHLIGHTS

Sony Xperia XZ3 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android Pie తో నడుస్తుంది, స్నాప్డ్రాగెన్ 845 SoC చే శక్తిని కలిగి ఉంది మరియు ఒక OLED HDR డిస్ప్లే కలిగి ఉంది.ఇందులోనోచ్ లేదు. IFA 2018 లో ఈ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించారు.

సోనీ ఎక్స్పీరియా XZ2 కు వారసుడిగా ఈ ఎక్స్పీరియా XZ3 విడుదలైనట్లు ప్రకటించారు. స్మార్ట్ఫోన్ డిజైన్, మరియు స్పెసిఫికేషన్స్ పరంగా పెద్దగా మార్పులేమిలేవు, కానీ అది కొత్త ఫీచర్లను ఒక గుట్టగా తెస్తుంది. ఫిబ్రవరిలో Xperia XZ2 తిరిగి ప్రకటించబడింది.

సోని ఎక్స్పీరియా XZ3 స్పెసిఫికేషన్స్

దీని స్పెసిఫికేషన్ వివరాలకు వస్తే , హుడ్ కింద చాలా మార్పులతో దాని పూర్వీకుల వలె ఉంటుంది. Xperia XZ3 ఇది XZ2 కంటే సన్నగా 9.9mm మందంతో ఉంది. స్మార్ట్ఫోన్ 193 గ్రాముల బరువును కలిగి ఉంటుంది, అలాగే సింగిల్ మరియు డ్యూయల్ సిమ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. XZ3 లో ఉన్నఅతి పెద్ద మార్పు XZ2 లో ఉన్న IPS LCD కు బదులుగా P-OLED డిస్ప్లే ని ఇది కలిగి ఉంటుంది. XZ3 లో 6 అంగుళాల 18: 9 HDR డిస్ప్లేను 2880×1440 రిజల్యూషన్తో కలిగి ఉంది. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ తో రక్షించబడింది. హుడ్ కింద, XZ3 4జీబీ  ర్యామ్ తో కలిసి ప్రయత్నించిన మరియు పరీక్షించిన స్నాప్డ్రాగెన్ 845 SoC ను కలిగి ఉంది. ఇది విస్తరించదగిన స్టోరేజి తో పాటుగా 64జీబీ అంతర్నిర్మితంగా ఉంది మరియు ఆండ్రాయిడ్ P తో స్మార్ట్ఫోన్ నడుస్తుంది బాక్స్ నుండి వస్తూనే.  30fps వద్ద 4K లో వీడియో రికార్డు చేసే ఒక 19ఎంపీ షూటర్ వెనుక ఉంటుంది.  ముందు 13ఎంపీ షూటర్ ఉంది. స్మార్ట్ఫోన్ బ్లూటూత్ 5 కి మద్దతు ఇస్తుంది మరియు 3300mAh బ్యాటరీతో శక్తిని అందిస్తుంది.

సోని ఎక్స్పీరియా XZ3 ధర , అందుబాటు మరియు రంగుల ఎంపికలు

IFA 2018 లో, సోనీ Xperia XZ3 ధర ప్రకటించలేదు, కానీ ,ఈ స్మార్ట్ ఫోన్ యొక్క షిప్పింగ్ సెప్టెంబరులో పార్రంభం కానున్నదని భావిస్తున్నారు. ఇది బాక్స్ బయటకు వస్తూనే  Android P తో నడిచే మొదటి డివైజ్లలో ఒకటిగా ఉంటుంది. బ్లాక్, వైట్ సిల్వర్, ఫారెస్ట్ గ్రీన్ మరియు బోర్డియక్స్ రెడ్ వంటి రంగుల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటాయి.ఈ స్మార్ట్ఫోన్లు భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టనుంది మరియు రంగు ఎంపికలు సోనీ ఇంకా ప్రకటించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo