13MP కెమేరా తో సోనీ M5, C5 మొబైల్స్ లాంచ్

Updated on 03-Aug-2015
HIGHLIGHTS

డ్యూయల్ 13MP కెమేరా, 3GB ర్యామ్, 21.5 MP కెమేరా సేన్సార్స్ వీటి ప్రత్యేకతలు

జపనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, సోనీ రెండు కొత్త ఫోనులను మార్కెట్ లో లాంచ్ చేసింది. Xperia M5, Xperia C5 అల్ట్రా వీటి పేరులు. రెండు ఫోనులు కెమేరాకు పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చాయి.

సోనీ Xperia C5 అల్ట్రా స్పెసిఫికేషన్స్ – 6in 1080P డిస్ప్లే, సోనీ bravia engine 2 దీని డిస్ప్లే లో వాడింది కంపెని. డిజైన్ పరంగా కూడా దాదాపు దీనికి bezels లేవని చెప్పాలి. 187 గ్రా బరువు ఉన్న C5 8.2 mm మందం తో బాడీ బిల్డ్ ఉంది. టోటల్ మెటల్ aluminum ఫ్రేమ్ మరియు గ్లాసీ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్.

1.7GHz మీడియా టెక్ MTK6752 SoC, 2GB ర్యామ్, 200GB కార్డ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, 13MP కెమేరా మరియు  వైడ్ angle లెన్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్, ఆటో ఫోకస్ 1080P వీడియో రికార్డింగ్, 2,930 mah బ్యాటరీ. వీటి రెండింటి prices మరియు availability ఇంకా వెల్లడించలేదు కంపెని. కాని ఈ సంవత్సరం సెప్టెంబర్ లో  రానున్నాయని రూమర్స్.


సోనీ Xperia M5 స్పెసిఫికేషన్స్ – ఇది డిజైన్ పరంగా Z3+ కు సిమిలర్ గా ఉంది. 5in 1080P bravia engine 2 తో డిస్ప్లే, 64బిట్ మీడియా టెక్ Helio X10 2GHz ఆక్టో కోర్ SoC ప్రొసెసర్, 3GB ర్యామ్, 16 GB ఇంబిల్ట్ స్టోరేజ్, 200GB అదనపు స్టోరేజ్ సపోర్ట్, 21.5MPEXMOR RS కెమేరా సేన్సార్స్ , హైబ్రిడ్ ఆటో ఫోకస్, 4K వీడియో రికార్డింగ్, వీడియో stabilizer, 13MP HDR ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమేరా, IP65 & IP68 సర్టిఫికేషన్ వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ resistant.

C5 అల్ట్రా వలె దీనికి కూడా మెటల్ సైడ్స్ ఉన్నాయి కాని aluminum బదులు దీనికి స్టిల్ మెటల్ ఉంది. 145 గ్రా బరువు ఉన్న M5 7.6 mm మందం మరియు డ్యూయల్ సిమ్ డివైజ్ గా వస్తుంది.  

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :