స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్ లేటెస్ట్ గా క్వాల్ కామ్ నుండి రిలీజ్ అయిన SoC. ఇది 810 కన్నా రెండు రెట్లు ఫాస్ట్ గా ఉంటుంది అని చెబుతుంది Qualcomm.
రీసెంట్ గా చైనా పాపులర్ సైట్, Weibo లో Geekbench స్కోర్స్ comparison గ్రాఫ్ పోస్ట్ అయ్యింది. దీనిలో డ్యూయల్ కోర్ ఆపిల్ A9 స్నాప్ డ్రాగన్ 820 కన్నా ఫాస్ట్ గా ఉంది అని వెల్లడించింది Weibo.
అదే వెబ్ సైట్ ఇప్పుడు స్నాప్ డ్రాగన్ 820 పై ఉన్న Adreno 530 GPU, ఆపిల్ A9 SoC పై ఉన్న ( PowerVR Series 7XT GT7600 ) GPU కన్నా 10 టైమ్స్ ఫాస్ట్ అని రిపోర్ట్ చేసింది.
స్నాప్ డ్రాగన్ 820 మెయిన్ స్ట్రీమ్ మొబైల్ మార్కెట్ లోకి రావటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ కు మాత్రమే కంపెనీలు లేటెస్ట్ ప్రోసేసర్స్ అందిస్తాయి.
ఆపిల్ A9 ప్రొసెసర్ ఆల్రెడీ ఐ ఫోన్ 6S లో ఉంది. GPU టెస్ట్స్ లో తేలిన స్కోర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాప్ ను తీయటానికి తొందరలోనే ఆపిల్ దీనిపై పనిచేసే అవకాశాలున్నాయి.
శామ్సంగ్ Exynos 8890 SoC కూడా చాలా పవర్ ఫుల్ 12 కోర్ GPU కలిగి ఉంది. అయితే ఇది పేపర్ స్పెక్స్ పైన మాత్రమే. రియల్ టైమ్ లో దీని పవర్ ఇంకా కనపడలేదు ఎటువంటి టెస్ట్ లలో కూడా.