ఐ ఫోన్ 5S ను 68 రూ లకు సేల్ పెట్టి ఇప్పుడు ఫైన్ కట్టే పరిస్థితికు వచ్చిన స్నాప్ డీల్
2014 లో స్నాప్ డీల్ తన వెబ్ సైట్ లో ఐ ఫోన్ 5S 16GB స్మార్ట్ ఫోన్ ను 68 రూ లకే సేల్ పెట్టింది. అయితే అది ఎలా జరిగింది అనేది స్పష్టత లేదు కాని..
Nikhil బన్సాల్ అనే స్టూడెంట్ దానిని వెంటనే కొనటం జరిగింది. కాని స్నాప్ డీల్ దానిని షిప్ చేయలేదు. నిఖిల్ దీనిని అడగటానికి కంపెని కు ఎన్ని మెయిల్స్ పెట్టినా సమాధానం రాలేదు.
ఆఖరికి పంజాబ్ లోని స్టేట్ కన్సుమర్ dispute redressal commission లో నిఖిల్ కంప్లైంట్ చేయటం జరిగింది. మార్చ్ 2015 లో స్నాప్ డీల్ అదే ధరకు నిఖిల్ కు ఫోన్ ఇవ్వాలి అని ఆర్డర్ జారి చేసింది.
కాని రీసెంట్ గా స్నాప్ డీల్ మళ్ళీ appeal పెట్టడం తో లేటెస్ట్ గా గతంలోని ఆర్డర్ ను తొలిగించి 10 వేల రూ ఇస్తే చాలు నిఖిల్ కు అని తేల్చింది.
ఇది ప్రోడక్ట్ ను డెలివర్ చేయటంలో ఫెయిల్ అయినందుకు అని చెప్పింది కన్సుమర్ కమిషన్. అస్సలు 68 రూ లకే ఐ ఫోన్ ఎలా లిస్టు అయ్యింది అని అడిగితే స్నాప్ డీల్ అది టెక్నికల్ ప్రాబ్లెం వలన జరిగింది అని చెబుతుంది.