పడుకునే ముందు స్మార్ట్ ఫోన్స్ ను చీకటిలో వాడితే టెంపోరరీ blindness వస్తుంది అని తాజా వార్తలు వినిపిస్తున్నాయి ఇంటర్నెట్ లో.
ఇందుకు ఉదాహరణే రీసెంట్ గా UK ఇద్దరు వ్యక్తులు neuro ophthalmic క్లినిక్ లో ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ను చీకటి లో చూడటం వలన ‘Transient Smartphone Blindness’ కు గురయ్యారు అని వెల్లడించింది New England Journal of Medicine పత్రిక.
అది కూడా పడుకునే టప్పుడు అనేది మరి ముఖ్యమైన కారణం అని చెబుతున్నారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల పై రీసర్చ్ చేస్తే వారు ఎటు వైపుకు తిరిగి పడుకున్నారో ఆ వైపు కన్ను blindness కు చేరువైంది.
టెంపోరరీ అంటే 15 నిమిషాల వరకు బ్లయిండ్ గా ఉంటుంది. ఇది పెరగవచ్చు లేదా ఇంకా తక్కువ ఉండవచ్చు.