భారత్ లో భారీగా తగ్గిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..ఏ బ్రాండ్ ఎంత అంటే.!
స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో భారీ క్షీణిత
భారత మార్కెట్ లో ప్రీమియం ఫోన్ల హవా నడుస్తోంది
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గాయి
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ధిక మాంద్యం నీడలే కనిపిస్తున్నాయి. దీనికి స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా తలవంచిందనే చెప్పాలి. ఎందుకంటే, గత సంవత్సరం మొదటి మూడు నెల స్మార్ట్ ఫోన్ అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి మూడు నెలల అమ్మకాల్లో భారీ క్షీణితను చూసింది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ 2023 (జనవరి టూ మార్చి) ఫస్ట్ క్వార్టర్ అమ్మకాలలో భారీ డ్రాప్ నమోదు అయ్యింది. అయితే, ఇది బడ్జెట్ ఫోన్ల పైన క్షిణత కనిపించగా ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాల్లో మాత్రం పెరుగుదల నమోదయ్యింది.
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో భారీ అమ్మకాలను నమోదు చేసే భారత మార్కెట్ లో ఇప్పుడు ప్రీమియం ఫోన్ల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, దేశవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 60% పెరిగినట్లు కౌంటర్ పాయింట్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, మొత్తంగా చూస్తే మాత్రం భారత్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా తగ్గాయి.
ఈ నివేదిక ప్రకారం, 30 నుండి 45 వేల రూపాయల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 60% వృద్ధి చెందగా, 45 వేల కంటే అధిక ధర కలిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 66% వృద్ధిని సాధించినట్లు తెలిపింది. అయితే, ముందుగా ఎక్కువ అమ్మకాలను నమోదు చేసే బడ్జెట్ కేటగిరి 10 నుండి 20 వేల సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 34% క్షీణించగా, 20 నుండి 30 వేల సెగ్మెంట్ లోని స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 33% క్షీణించింది. అలాగే, 10 వేల రూపాయల లోపు కేటగిరిలో ఫోన్ల అమ్మకాలు కూడా 9% క్షీణించినట్లు కౌంటర్ పాయింట్ నివేదించింది.
అయితే, టోటల్ మొబైల్ మర్కెట్ ను పరిశీలిస్తే గత ఫస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఓవరాల్ గా 19% వరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించి నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇక మార్కెట్ లో ఏ బ్రాండ్ ఎంత వాటిని కలిగి ఉందని చూస్తే, మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 20% వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో నిలువగా, 17% వాటాతో Vivo రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
Xiaomi ఒక మెట్టు క్రిందకు దిగి 16% శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. OPPO 12% శాతం వాటాతో 4వ స్థానాన్ని, 9% వాటాతో Realme 5 స్థానాల్లో నిలిచాయి. మిగిలిన 25% వాటాలో ఇతర కంపెనీల షేర్ వుంది.
ఈ సంవత్సరం మార్కెట్ లో అమ్మడైన ఫోన్లలో సగానికి పైగా 5G స్మార్ట్ ఫోన్లు ఉండడం విశేషం.