ఇండియాలో 500/1000 రూ నోట్లు బాన్ తో e commerce వెబ్ సైట్స్ కాష్ ఆన్ డెలివరి(COD) పేమెంట్స్ పై నిషేధం మొదలుపెట్టారు.
అవును ఆల్రెడీ అమెజాన్ పూర్తిగా COD పేమెంట్ ను నిలిపివేసినట్లు తెలుస్తుంది. అమెజాన్ ఇండియా సైట్ లో దీనికి సంబంధించిన మెసేజ్ ఉంది.
"మేము COD పేమెంట్ ను disable చేశాము. సో డెబిట్, క్రెడిట్ , నెట్ బ్యాంకింగ్ లేదా గిఫ్ట్ కార్డ్స్ ను వాడగలరు" అనే మెసేజ్ ను చూపిస్తుంది అమెజాన్.
ఫ్లిప్ కార్ట్ కూడా 2000 రూ మించిన ఐటమ్స్ కు కొన్ని వాటికి "COD అందుబాటులో లేదు" అనే మెసేజ్ ను చూపిస్తుంది. అదే విధంగా స్నాప్ డీల్ కూడా COD ఉంటుంది కాని 500/1000 రూ నోట్లు తీసుకోవటం జరగదు అని చెబుతుంది.
దేశంలో అర్థరాత్రి నుండి బాన్ అయిన 500/1000 నోట్ల బాన్ పై మీకు ఉన్న కంప్లీట్ డౌట్స్ ను ఈ లింక్ లో క్లియర్ చేయటం జరిగింది.