షార్ప్ కంపెని వినూత్నమైన డివైజ్ ను విడుదల చేసింది. దీని పేరు RoBoHon. నడవటం, మాట్లాడటం, డాన్స్ చేయటం వంటి రోబోటిక్ పనులతో పాటు ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా.
RoBoHon స్పెసిఫికేషన్స్ – 1.2GHz స్నాప్ డ్రాగన్ 400 ప్రొసెసర్, 2 in QVGA బ్యాక్ స్క్రీన్, 3G అండ్ LTE ఉన్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ os పైనే రన్ అవుతుంది. ఇది 2016 లో అందుబాటులోకి రానుంది.
రోబో కల్ల మధ్యలో కెమేరా, forehead పైన పికో ప్రొజెక్టర్ ఉంటాయి దీనికి. ఇది టెక్స్ట్ మెసేజ్ లను బయటకు చదవటం, కాల్స్ ను స్పీకర్ లో ఆన్సర్ చేయటం కూడా చేస్తుంది.
దీని బరువు 390 గ్రా. 19.5 cm పొడవు ఉంది. అంటే పాకెట్ ఫ్రెండ్లీ డివైజ్ కాదు ఇది. దీని కోసం చిన్న క్యారీ బ్యాగ్ కూడా ఉంది. దీనిని డెవలప్ చేసిన రోబోటిసిస్ట్ పేరు takahashi. ఇతను ఇంతకముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కూడా Kirobo అనే రోబో ను డిజైన్ చేశారు. kirobo రోబో ల ఇంటరాక్షన్ గురించి స్టడీ చేసే రోబో.