ఆక్వాస్ క్రిస్టల్ 2 పేరుతో బెజెల్ లేని ఫోన్ ని విడుదల చేసింది షార్ప్. జపాన్ లో ఉన్న సాఫ్ట్ బ్యాంక్ టెలీ కమ్యునికేషన్స్ కంపెని వెబ్ పేజ్ లో ఈ హాండ్ సెట్ కనిపించింది. 2015 జూలై లో రిలీజ్ కానుంది.
గత సంవత్సరంలో విడుదల అయిన అక్క్వాస్ క్రిస్టల్ కి షార్ప్ అక్క్వాస్ క్రిస్టల్ 2 సెకండ్ వెర్షన్. 1280 x 720 పిక్సెళ్ళు స్పష్టతతో ఫోన్ 5.2 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. వాటర్ మరియు డస్ట్ రెసిస్తేంట్ బాడీ తో వస్తున్న ఈ మొబైల్ లో 16జిబి ఇంటర్నెల్ మెమరీ మరియు 128జిబి వరకూ ఎక్స్టర్నల్ మెమరీ పెట్టుకునే అవకాశం ఉంది. Qualcomm యొక్క స్నాప్డ్రాగెన్ 400 క్వాడ్-కోర్ 1.2 GHz ప్రాసెసర్ మరియు 2జిబి ర్యామ్ తో Android 5.0 OS పై నడుస్తుంది.
షార్ప్ అక్క్వాస్ క్రిస్టల్ 2. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 2.1 MP సెకండరీ కెమెరా తో LED ఫ్లాష్ కలిగి ఉంది ఈ ఫోన్. బెజెల్ లెస్ డిస్ప్లే కారణంగా దీని ఇయర్ ఫోన్ స్పీకర్ బోన్ కండ్యుసింగ్ టెక్నాలజీ పై రిప్లేస్ చేయడం జరిగింది. మరియు ఫ్రంట్ కెమేరా స్క్రీన్ అడుగున ఉంది. ఆక్వాస్ క్రిస్టల్ 2 లో కనెక్టివిటీ పరంగా 4G LTE, 3G బ్లూటూత్, USB, వైఫై, NFC మరియు GPRS / EDGE లు ఉన్నాయి. ఫోన్ చుట్టూ టచ్ ను కనుగొనుటకు గ్రిప్ మేజిక్ సెన్సార్ ను వాడటం జరిగింది. మొబైల్ వాలెట్ సదుపాయం ఉన్న ఆక్వాస్ క్రిస్టల్ 2.136 x 71 x 11mm డైమెన్షన్స్ తో మరియు 154 గ్రాముల బరువు కలిగి ఉంది. 2030mah బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ జపాన్ కాకుండా ఇతర దేశాల్లో మార్కెట్ చేస్తుందో లేదో తెలియదు. సాఫ్ట్ బ్యాంక్ లిస్టింగ్ ప్రకారం ఇది బ్లాక్, వైట్, పింక్ మరియు, టర్క్యోయాస్ కలర్స్ లో లభ్యమవుతుంది.
ఆధారం: సాఫ్ట్ బ్యాంక్