బెజెల్ లెస్ 5.2 ఇంచిల ఫోన్ ను విడుదల చేసిన షార్ప్ కంపెని

బెజెల్ లెస్ 5.2 ఇంచిల ఫోన్ ను విడుదల చేసిన షార్ప్ కంపెని
HIGHLIGHTS

క్వాడ్ కోర్ స్నాప్డ్రాగెన్ SoC మరియు ఆండ్రాయిడ్ 5.0 తో విడుదలైన షార్ప్ అక్క్వాస్ క్రిస్టల్ 2

ఆక్వాస్  క్రిస్టల్ 2 పేరుతో బెజెల్ లేని ఫోన్ ని విడుదల చేసింది షార్ప్. జపాన్ లో ఉన్న సాఫ్ట్ బ్యాంక్ టెలీ కమ్యునికేషన్స్ కంపెని వెబ్ పేజ్ లో ఈ హాండ్ సెట్ కనిపించింది. 2015 జూలై లో రిలీజ్ కానుంది.

 గత సంవత్సరంలో విడుదల అయిన అక్క్వాస్ క్రిస్టల్ కి  షార్ప్ అక్క్వాస్ క్రిస్టల్ 2 సెకండ్ వెర్షన్. 1280 x 720 పిక్సెళ్ళు స్పష్టతతో ఫోన్ 5.2 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. వాటర్ మరియు డస్ట్ రెసిస్తేంట్ బాడీ తో వస్తున్న ఈ మొబైల్ లో 16జిబి ఇంటర్నెల్ మెమరీ మరియు 128జిబి వరకూ ఎక్స్టర్నల్ మెమరీ పెట్టుకునే అవకాశం ఉంది. Qualcomm యొక్క స్నాప్డ్రాగెన్ 400 క్వాడ్-కోర్ 1.2 GHz ప్రాసెసర్ మరియు 2జిబి ర్యామ్ తో Android 5.0 OS పై నడుస్తుంది.

షార్ప్ అక్క్వాస్ క్రిస్టల్ 2. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 2.1 MP సెకండరీ కెమెరా తో LED ఫ్లాష్ కలిగి ఉంది ఈ ఫోన్. బెజెల్ లెస్ డిస్ప్లే కారణంగా దీని ఇయర్ ఫోన్ స్పీకర్ బోన్ కండ్యుసింగ్ టెక్నాలజీ పై రిప్లేస్ చేయడం జరిగింది. మరియు ఫ్రంట్ కెమేరా స్క్రీన్ అడుగున ఉంది. ఆక్వాస్  క్రిస్టల్ 2 లో కనెక్టివిటీ పరంగా 4G LTE, 3G బ్లూటూత్, USB, వైఫై, NFC మరియు GPRS / EDGE లు  ఉన్నాయి. ఫోన్ చుట్టూ టచ్ ను కనుగొనుటకు గ్రిప్ మేజిక్ సెన్సార్ ను వాడటం జరిగింది. మొబైల్ వాలెట్ సదుపాయం ఉన్న ఆక్వాస్  క్రిస్టల్ 2.136 x 71 x 11mm డైమెన్షన్స్ తో మరియు 154 గ్రాముల బరువు కలిగి ఉంది. 2030mah బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ జపాన్ కాకుండా ఇతర దేశాల్లో మార్కెట్ చేస్తుందో లేదో తెలియదు. సాఫ్ట్ బ్యాంక్ లిస్టింగ్ ప్రకారం ఇది బ్లాక్, వైట్, పింక్ మరియు, టర్క్యోయాస్ కలర్స్ లో లభ్యమవుతుంది.

 

ఆధారం: సాఫ్ట్ బ్యాంక్

Silky Malhotra

Silky Malhotra

Silky Malhotra loves learning about new technology, gadgets, and more. When she isn’t writing, she is usually found reading, watching Netflix, gardening, travelling, or trying out new cuisines. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo