గూగల్ ఆండ్రాయిడ్ M కొత్త వెర్షన్ పేరు “మార్ష్ మల్లో”

Updated on 18-Aug-2015
HIGHLIGHTS

ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకోవటానికి లింక్స్ ను కూడా ఇచ్చింది

ఆండ్రాయిడ్ తాజాగా రిలీజ్ చేసిన కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 6 పేరు, Marshmallow. నిన్న గూగల్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది ఈ పేరును. ఇది ఆండ్రాయిడ్ 6th వెర్షన్. 

ఆండ్రాయిడ్ తన మొబైల్ os కు పేరును ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెడుతుంది. ఇప్పటి వరకూ లేటెస్ట్ గా మొబైల్స్ లో ఉన్న లాలిపాప్ వరకూ అలానే ఫాలో అయ్యింది. సో ఆ పద్ధతిలో 6th వెర్షన్ ను ఆండ్రాయిడ్ M అని పిలుస్తూ వచ్చింది కాని M కు పేరు ను ఖరారు చేయలేదు.

నిన్న ఫైనల్ M వెర్షన్ ప్రివ్యూ ను రిలీజ్ చేయటం తో గూగల్ అఫిషియల్ ఆండ్రాయిడ్ డెవలపర్స్ బ్లాగ్ లో పోస్ట్ చేసింది ఈ విషయం. ఆండ్రాయిడ్ os ప్రేమికులా మీరు..?? అయితే అసలు ఆండ్రాయిడ్ M ఎప్పుడూ లాంచ్ అయ్యింది. దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి? కొత్త మార్పులు ఏంటి? ఎప్పుడూ వస్తుంది మొబైల్స్ అనే విషయాలు ఈ లింక్ లో తెలుసుకోగలరు.

Marshmallow అంటే ఇంటర్నేషనల్ దేశాలలో వాడే సుగర్ కేండీ చాక్లెట్ అని అర్థం. పైన గ్రీన్ కలర్ ఆండ్రాయిడ్ రోబో చేతిలో ఉన్న వైట్ కలర్ ఐటమే Marshmallow అంటే. ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్ అన్నీ వెర్షన్స్ కు స్వీట్స్…eatable ఐటమ్స్ పెరులనే పెట్టింది. మొదటి ఆండ్రాయిడ్ M ప్రివ్యూ నేక్సాస్ 5, 6, 9 మరియు నేక్సాస్ ప్లేయర్ డివైజ్ లలో కి వస్తుంది.  

మీది నేక్సాస్ మోడల్ అయితే, ఆండ్రాయిడ్ M ను మీరు కూడా ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయగలరు. ఆండ్రాయిడ్ ఎప్పుడూ హై ఎండ్ ఫోనులకే లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి ఇస్తుంది. సో మీ ఫోన్ కు ఉంటేనే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే అనవసరం. మొదటిగా నేక్సాస్, తరువాత మోటోరోలా ఫోనులకు హై ఎండ్ నుండి మిడ్ ర్యాంజ్ ఫోనులకు ఆండ్రాయిడ్ M రావటం మొదలవుతుంది. అన్నీ ఫోనులకు రాదు. ఆండ్రాయిడ్ లో ఉన్న మైనస్ లలో ఇది ఒకటి. ఐ os అప్ డేట్స్ లా ఆండ్రాయిడ్ అన్నీ ఫోనులకు అప్ డేట్ ను రిలీజ్ చేయదు.

ఇమేజ్ ఆధారం: TechnoBuffalo

Connect On :