జనవరీ లో బుక్ లాగ fold చేయగలిగే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్
తాజా టెక్ రిపోర్ట్స్ ప్రకారం సామ్సంగ్ foldable డిస్ప్లే ఉండే కొత్త స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్, Valley. ఇది కనుక వాస్తవమైతే, ఇదే ప్రపంచంలోని మొదటి foldable స్మార్ట్ ఫోన్ అవుతుంది.
కంపెని కూడా గతంలో ఇలాంటి ఫోన్ ఒకటి తయారు చేస్తున్నట్లు హింట్స్ ఇచ్చింది. ఇది ఎప్పుడో రిలీజ్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోనవసరం లేదు, కాని జనవరి 2016 లోనే ఇది రానుంది అని న్యూస్
ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ఫోన్ టెస్టింగ్ దశలో ఉంది అని సామ్సంగ్ ఫోన్స్ యొక్క ఫేమస్ రూమర్స్ బ్లాగ్, sammobile చెబుతుంది. 3gb ర్యామ్, sd కార్డ్ స్లాట్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ తో స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ పై పనిచేయనుంది ఇది.
గతంలో 2013 లోనే ఫ్లెక్సిబుల్ డిస్ప్లే లను డెమో చేసాయి సామ్సంగ్, నోకియా సోనీ వంటి కంపెనీలు. అయితే ఈ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే గ్లాస్ తో కాకుండా ప్లాస్టిక్ తో తయారు చేయ బడ్డాయి. కాని అవి టెక్నాలజీ డెమో హాండ్ సెట్ inventions మాత్రమే.
అయితే రోజు రోజుకూ పెద్ద పెద్ద డిస్ప్లే లు స్మార్ట్ ఫోన్ జోనర్ లోకి వస్తుండటంతో, foldable స్మార్ట్ ఫోన్స్ పోర్టబుల్ గా ఉండేందుకు ఉపయోగపడతాయి అని ఒక అంచనా.
ఆధారం: sammobile