SAMSUNG యొక్క మొట్టమొదటి సొంత తయారీ ఫోన్ : శామ్సంగ్ గెలాక్సీ A6s

Updated on 26-Oct-2018
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 6 అంగుళాల డిస్ప్లే మరియు స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ తో వస్తుంది.

 శామ్సంగ్ యొక్క సొంత తయారీ ఫోన్, అని చెబుతున్నామని ఆశ్చర్య పడకండి. మీ చదువుతున్నది నిజమే మీకు అర్ద్మయ్యేలా చెప్పాలంటే, ఇటీవలే చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో  శామ్సంగ్ తన A సిరీస్ నుండి, గెలాక్సీ A9s మరియు గెలాక్సీ A6s రెండు ఫోన్లను విడుదల చేసింది.  ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో, గెలాక్సీ A9s ముందుగా మలేషియాలో విడుదలైన గెలాక్సీ A9 యొక్క రీబ్రాండింగా వచ్చింది. అయితే, ఈ గెలాక్సీ A6s ని మాత్రం ODM గా ప్రకటించింది. ఈ ODM అంటే, ఒరిజినల్ డిజైన్ మాన్యుఫ్యాక్చేరర్ అని అర్ధం.

సామాన్యంగా, కొన్ని కంపెనీలు వాటికి నచ్చిన విధంగా మరొక కంపెనీతో పరికరాలను తయారీ చేపిస్తాయి వీటిని సొంత తయారుగా మనము పరిగణించలేము. ఉదాహరణకి నోకియా కి సంబంధించిన డిజైన్లను HMD గ్లోబల్ తయారుచేస్తుంది.  అలాగే శామ్సంగ్ విషయానికి వస్తే, సాధారణంగా వీటి డిజైన్లను వింటెక్ తయారీ చేస్తుంది. అయితే, షావోమి మాత్రం సొంతంగా వాటి డిజైన్లను మాన్యుఫాక్చరింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు శామ్సంగ్ కూడా ఈ శామ్సంగ్ గాలక్సీ A6s స్మార్ట్ ఫోన్ ని సొంతంగా మాన్యుఫాక్చరింగ్ చేసింది.

Samsung Galaxy A6s ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC మరియు 6GB శక్తితో 64GB/128GB అంతర్గత స్టోరేజితో జతగా వస్తుంది. ఈ ఫోన్ 2160 x 1080 పిక్సెల్స్ అందించగల ఒక 6- అంగుళాల సూపర్ అమోల్డ్ FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా చుస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో 12MP+2MP డెప్త్ సెన్సార్ గల డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం, 12MP షూటర్ని కూడా కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్ మరియు ఈ మొత్తం ప్యాకేజీకి సరిపోయే 3,300mAh బ్యాటరీని కూడా దీనిలో అందించారు. ఇది శామ్సంగ్ UI ఆధారిత ఆండ్రాయిడ్ ఓరెయో OS తో నడుస్తుంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :