సాంసుంగ్ గేర్ ఎస్ 3 స్మార్ట్ వాచ్ మార్కెట్ లో విడుదల
భారత్ లో విడుదల అయిన సాంసుంగ్ గేర్ ఎస్ 3 స్మార్ట్ వాచ్
ఆఖరి ఏడాది అయిన 2016 లోనే దీని గురించి ప్రకటించటం జరిగింది ,కాకపొతే అది ఎట్టకేలకు భారత్ లో సగర్వంగా మార్కెట్ లోకి ఈ సంవత్సరం విడుదల అయింది ,ఈ గేర్ ఎస్ 3 రెండు అందుబాటు వేరియంట్స్ తో (క్లాసిక్, ఫ్రాంటైర్) మంగళవారం మార్కెట్ లో విడుదల అయి కొనుగోలుదారులను ఆకరిషిస్తున్నది
బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయిపోయాయి ,ఇది 28,500 లకే మార్కెట్ లో లభిస్తున్నది దీనిలో వున్నా ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ కు వచ్చిన కాల్స్ ఎస్ ఎమ్ ఎస్ లాంటి ఇతర నోటిఫికెషన్స్ ని చేతికున్న వాచ్ లోనే చూసుకోవచ్చు
దీని యొక్క మరిన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం ఓ లుక్కేయండి
1. 3 ఇంచ్ సూపర్ అమోల్డ్ ఫుల్ సర్క్యులర్ డిస్ప్లే {రిసొల్యూషన్ 360× 360పిక్సల్స్, 278 డీపీఐ}
గొరిల్లా గ్లాస్ కలిగి వుంది
always on అనే ఫీచర్ ని కలిగి వుంది
ఈ వాచీలో 768MB ర్యామ్ అలానే 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌లు ఉంటాయి
380mAh బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై నాలుగు రోజుల వరకు బ్యాకప్‌ను సమకూర్చగలదని సమాచారం
మ్యాపింగ్ వివరాల కోసం GPS, మొబైల్ పేమెంట్స్ కోసం NFC వంటి సదుపాయాలు ఈ వాచ్ లో పొందుపరచటమైనది
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ 1GHz డ్యుయల్ కోర్ ప్రాసెసర్ కలిగి వుంది
LTE నెట్‌వర్క్ సపోర్ట్
గేర్ ఎస్3 స్మార్ట్‌వాచ్ బ్లుటూత్ వై-ఫైలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది,మరియు గేర్ ఎస్ 3 ఫ్రాంటైర్ వేరిఅంట్ బ్లుటూత్ వై-ఫైలతో lTE నెట్వర్క్స్ ని సపోర్ట్ చేయటం దీని ప్రత్యేకత
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ కొరకు IP68 సెర్టిఫికేషన్ తో మీ ముందుకు వస్తుంది