వినియోగదారుల వాడుతున్న 25 లక్షల పైగా నోట్ 7 ఫోనులను తిరిగి ఇచ్చేయమని ప్రకటించిన సామ్సంగ్

వినియోగదారుల వాడుతున్న 25 లక్షల పైగా నోట్ 7 ఫోనులను తిరిగి ఇచ్చేయమని ప్రకటించిన సామ్సంగ్

సామ్సంగ్ తన సొంత వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన statement లో రీసెంట్ గా రిలీజ్ అయిన గెలాక్సీ నోట్ 7 ను గ్లోబల్ గా వాడుతున్న వారందరూ ఫోన్ ను వాడటం ఆపేసి రిటర్న్ చేయమని వెల్లడించింది.

immediate వారికి రీప్లేస్మెంట్ ఇస్తున్నట్లు కూడా తెలిపింది సామ్సంగ్. కంపెని సర్వీస్ సెంటర్స్ కు వెళితే temporary గా వేరే మోడల్ కూడా ఇస్తున్నట్లు తెలిపింది. మీకు చదవటానికి ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సో సామ్సంగ్ మొబైల్ ప్రెసిడెంట్ స్వయంగా చెప్పిన మాటలు మీరే చూడండి క్రింద… 

"Our number one priority is the safety of our customers. We are asking users to power down their Galaxy Note 7s and exchange them as soon as possible," – Koh Dong-jin, Samsung's mobile president.

ఇంతకీ ఏమైంది?
ఫోన్ లాంచ్ చేసిన రెండు వారాల తరువాత 2.5 మిలియన్ల అమ్మకాలు జరిగిన సామ్సంగ్ గేలక్సీ నోట్ 7 గురించి కంపెని ఇలా ప్రకటించటం అందరినీ ఆశ్చర్యం చేస్తుంది. అయితే దీని వెనుక ఉన్న కారణం టోటల్ ఫోన్లలో సక్రమమైన rechargeable లిథియం బ్యాటరీస్ లేకపోవటమే. నోట్ 7 ఫోన్స్ నిప్పులతో పెలిపోవటం వంటివి సంగటనలు ఎదుర్కొంది కంపెని. ఇది కంపెని సప్లయర్స్ లోని ఒకరి లోపం వలన అని రిపోర్ట్స్. సెప్టెంబర్ 1 నాటికి దాదాపు ఇలాంటివి 35 కేసులు నమోదయ్యాయి.

అయితే కొత్తగా వచ్చే రీప్లేస్మెంట్ ఫోనులు కూడా అదే బ్యాటరీస్ తో లేనట్లు తెలుసుకునేది ఏలా?
కొత్తగా వచ్చే ఫోనుల బాక్స్ పై క్లియర్ గా ఈ తేడ తెలుసుకునేలా కంపెని ఒక వైట్ బార్ కోడ్ లేబుల్ తో పాటు స్మాల్ బ్లాక్ స్క్వేర్ మరియు S సింబల్ కలిగిన stickering ఉంటుంది. క్రింద ఇమేజ్ ఉంది చూడగలరు.

దీనితో పాటు కంపెని IMEI డేటాబేస్ టూల్ ను ప్రవేశ పెడుతుంది వచ్చే వారం. దీని ద్వారా కూడా ఫోన్ కొత్తగా లేదా fault బ్యాటరీస్ తో ఉన్న హాండ్ సెట్స్ అనేది తెలుసుకోగలరు. ఈ ఫోనులను ఎవరూ వాడకుండా ఎక్కడా పేలుడు సంగటనలు జరగకుండా..కంపెని రిమోట్ పద్దతిలో వాడుతున్న ఓల్డ్ నోట్ 7 హ్యాండ్ సెట్స్ ను సెప్టెంబర్ 30 తరువాత ఆపివేసే అవకాశాలున్నాయని రెడ్డిట్ యూసర్ ఒకటి ఈ లింక్ లోని థ్రెడ్ లో పోస్ట్ చేశారు. గమనిక: డిజిట్ ఎడిటర్ ను ఫేస్ బుక్ లో రీచ్ అయ్యేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo