షాక్, డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ లతో సామ్సంగ్ అఫీషియల్ గా S6 యాక్టివ్ రగ్గేడ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ఇది US లోనే దొరుకుతుంది ప్రస్తుతానికి. AT&T నెట్వర్క్ పై జూన్ 12 నుండి సెల్ అవనుంది.
రగ్గేడ్ అంటే స్మూత్ గా ఫోన్ ను వాడుకునే ప్రదేశాలలో లేని వారి కోసం ప్రధానంగా ఈ వర్షేన్. ఇది గేలక్సీ S6 కి రాగ్గేడ్ వెర్షన్. దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్. 5.1 in QHD సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే 1440 x 2560 పిక్సెల్స్ రిసల్యుషణ్, 576 ppi, 3,500 mah బ్యాటరీ, Exynos 7420 ఎనిమిదో కోర్ 64-బిట్ ప్రాసెసర్, వైఫై, 3g, NFC, GPS, మైక్రో usb, 16MP LED ఫ్లాష్ మరియు 5MP కేమేరాస్, 32 జిబి ఇంబిల్ట్ మెమరీ, వైట్ కేమో, బ్లూ కేమో మరియు గ్రే కలర్స్ లో లభ్యమవుతుంది. AT&T పై జీరో డౌన్ పేమెంట్ తో 44,500 రూ లకు 20, 24, 30 నెలల పేమెంట్స్ లో లభ్యం కానుంది ఇది.
రగ్గేడ్ అవుట్ డోర్ యూసేజ్ కోసం దించిన వెర్షన్ కాబట్టి దీనికి అదనంగా గ్లాస్ బ్యాక్ బదులు వేరే ఫ్రేమ్ ను యూజ్ చేసింది సామ్సంగ్. 4 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన ఏమి అవకుండా షాక్ ప్రూఫ్, 1.5 మీటర్లు లోతు వరకూ వాటర్ లో పాడవకుండా 30 నిముషాలు పాటు వాటర్ రేసిస్తంట్. ఇందుకోసం హోమ్, కెపాసిటీవ్ కీస్ మరియు ఫింగర్ ప్రింట్ ను ఇందులో పెట్టలేదు సామ్సంగ్.
దీనితో పాటు సామ్సుంగ్ గేలక్సీ S6 ప్లస్ మోడల్ ను లాంచ్ చేయనుంది త్వరలో. డ్యూయల్ ఎడ్జ్, 5.5 సూపర్ ఎమోలేడ్ కర్వ్ద్ డిస్ప్లే, హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్ స్పెక్స్ తో మరి కొన్ని వారాల్లో విడుదల అవనుంది అని రిపోర్ట్స్. అయితే పెద్ద స్క్రీన్ అయినప్పటికీ దీనికి పెన్ సపోర్ట్ ఉండదు అని అంటున్నారు.
ఆధారం: AT&T