సామ్సంగ్ గెలాక్సీ J7 & J5 2016 మోడల్స్ అఫీషియల్ గా unveil అయ్యాయి.
సామ్సంగ్ కంపెని గేలక్సీ J7 2016 మరియు గెలాక్సీ J5 2016 మోడల్స్ ను చైనీస్ వెబ్ సైట్ లో లిస్టు చేసి అఫీషియల్ గా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ను రివీల్ చేసింది.
అయితే వీటి ప్రైసెస్ మాత్రం ఇంకా వెల్లడికాలేదు. J7 లో 5.5 in FHD సూపర్ amoled డిస్ప్లే, ఆక్టో కోర్ 1.6GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3300 mah బ్యాటరీ ఉన్నాయి.
13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కేమెరా సెట్ అప్ ఉంది J7 2016 ఎడిషన్ లో. ఇవి రిపోర్ట్స్ కావు. కంపెని అఫిషియల్ సైట్ లో రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్.
J5 2016 లో 5.2in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.2GHz ప్రొసెసర్, 2GB ర్యామ్, 3100 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP రేర్ అండ్ 5MP కెమెరా ఉన్నాయి.
ఇవే పేర్లతో 2015 లో సామ్సంగ్ J7 స్మార్ట్ ఫోన్ ను 14,999 రూ లకు సెల్ చేస్తే గేలక్సీ J5 మోడల్ ను 11,999 రూ లకు సేల్స్ చేసింది.
సామ్సంగ్ డిజైన్, ప్రైసెస్ మరియు Low ఎండ్ స్పెక్స్ పై మెజారిటీ పీపుల్ కు కోపం ఉంది కాని కంపెని మిడ్ రేంజ్ లేదా బడ్జెట్ లో ఫోన్ లాంచ్ చేస్తే కొనటానికి ముందుకు వస్తున్నారు.