శామ్సంగ్ నాలుగు రియర్ కెమెరాలతో స్మార్ట్ ఫోన్ని ఆవిష్కరించనుంది. గెలాక్సీ A9 స్టార్ ప్రో గా పిలిచే ఈ ఫోన్నికంపెనీ వచ్చే నెలలో తెస్తోంది.

Updated on 19-Sep-2018
HIGHLIGHTS

ఈ ఉత్తర కొరియా దిగ్గజం ఇంతక మునుపే మూడు కెమెరాలతో గెలాక్సీ A7 ని ప్రవేశపెట్టింది.

ఇంతక ముందు కాలంలో, ఫోన్లోని సిమ్ స్లాట్ల మీద పోటీ ఉండేది. 1 సిమ్ స్లాట్ నుండి మొదలుపెట్టి 4 కంటే ఎక్కువ సిమ్లను మొబైల్లలోవాడుకునేలా అనేక రకాల చైనా కంపెనీలు పోటాపోటీగా తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో, ప్రస్తుతం కెమేరాల పోటీ నడుతున్నట్లు అనిపిస్తుంది. ఇంతక మునుపే మూడు కెమెరాలు కలిగిన A7 తో ముందుకొచ్చిన శామ్సంగ్ ఇప్పుడు అదే వరుసలో నాలుగు కెమేరాలతో దర్శనమివ్వనుంది. దీని కి గెలాక్సీ A9 స్టార్ ప్రో గా నామకరణం చేసినట్లు తెలుస్తుంది. ఇది రానున్న నెలలో మన ముందుకు రానుందని అంచనా. 

ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న పోటీ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ మధ్య – స్థాయి బడ్జెట్ ఫోన్గా ఉండవచ్చని తెలుస్తుంది.  ఇదే నిజమైతే ఈ స్మార్ట్ఫోన్ దాదాపుగా 30 వేలకంటే తక్కువగా ఉండవచ్చని ఆశించవచ్చు(అంచనా మాత్రమే). శామ్సంగ్ తన మిడ్ రేంజ్ ఫోన్లను ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో రిఫ్రెష్ చేస్తుంది ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా అని మనకు ముందుగానే శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క మొబైల్ కమ్యూనికేషన్స్ డివిజన్ ప్రసిడెంట్ మరియు ఐటి సీఈవో అయిన DJ కోహ్ తెలిపారు.

" మానుండి రానున్న డివైజ్ మిడ్-రేంజ్లో సెగ్మెంట్లో మంచి ప్రధాన ఫాగ్షిప్ ఫీచర్లు మరియు కార్యాచరణతో భారతీయ వినియోగదారులను రంజింపచేసేదిగా ఉంటుందని" కోహ్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ఆవిష్కరణ సమయంలో తెలిపిన మాట అందరికి విదితమే. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :