S4 మోడల్ సక్సెస్ కారణంగా దానికి మిని వెర్షన్, మిని ప్లస్ వెర్షన్ కూడా వస్తున్నాయి. తాజాగా సౌత్ కొరియన్ కంపెని, సామ్సంగ్ జెర్మనీ సామ్సంగ్ సైటు లో S4 మిని ప్లస్ మోడల్ ను 16,700 రూ ప్రవేశపెట్టింది.
దీని ఇండియన్ availability పై ఇంకా స్పష్టత లేదు కాని బడ్జెట్ సెగ్మెంట్ వేరియంట్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ S4 మిని ప్లస్ స్పెసిఫికేషన్స్ – 4.3 in సూపర్ అమోలేడ్ 540 x 960 qHD డిస్ప్లే, 1.5GB ర్యామ్, 1.2 GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB అదనపు స్టోరేజ్ సపోర్ట్,NFC,3G, 8MP కెమేరా, 1.9 ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, 1900 mah బ్యాటరీ.
ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 11,100 రూ లకు grand prime 4G డ్యూయల్ సిమ్ మోడల్ ను లాంచ్ చేసింది నిన్న సామ్సంగ్ ఇండియాలో. సామ్సంగ్ 4G ఇంటర్నెట్ కనెక్టివిటి పై ఎక్కువ శ్రద్ద పెడుతుంది. ఇప్పటివరకూ 14 4G మోడల్స్ ను లాంచ్ చేసింది.
లేటెస్ట్ స్పెక్స్ ను పట్టించుకోని స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు బ్రాండ్ వాల్యూ, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కోసం స్టాండర్డ్ గా ఉంటుంది అనే కారణాలతో దీనిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాని to be frank ఇందులో 1.5GB ర్యామ్ ఒక్కటే బెటర్ అనిపిస్తుంది.. అదీ కూడా చిన్న డిస్ప్లే లను ఇష్టపడే వారికే.