గెలాక్సీ M10, M20 యొక్క ఆండ్రాయిడ్ ఫై అప్డేట్ టైం లైన్ ఆవిష్కరించిన శామ్సంగ్

గెలాక్సీ M10, M20 యొక్క ఆండ్రాయిడ్ ఫై అప్డేట్ టైం లైన్ ఆవిష్కరించిన శామ్సంగ్
HIGHLIGHTS

జనవరి 28 న విడుదలకానున్న ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క ఆండ్రాయిడ్ ఫై అప్డేట్ టైం లైన్ ముందుగానే ప్రకటించింది.

ప్రస్తుతం, మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ విభాగంలో పాపులర్ అయినటువంటి, షావోమి, రియల్మీ మరియు హానర్ వంటి కంపెనీలకు గట్టి పోటీనివ్వడానికి,  గెలాక్సీ -M సిరీసును మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అయితే, కొత్తగా తీసుకురానున్నగెలాక్సీ -M సిరీసుతో ఎంతవరకు పోటీనిస్తుందో వేచిచూడాల్సిందే. ఈ విషయాన్నీ ప్రక్కన పెడితే, శామ్సంగ్ మాత్రం ఈ గెలాక్సీ -M సిరీసును చాల ప్రతిష్టాత్మకంగా మరియు గొప్ప అంచనాలతో తీసుకొస్తోంది. ఇప్పుడు ఈ శామ్సంగ్-M సిరీస్ ఫోన్లలో ఇన్ఫినిటీ V-డిస్ప్లే మరియు పెద్ద 5000mAh బ్యాటరీ వంటి మరికొన్ని ప్రత్యేకతలను తీసుకురానుంది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 యొక్క స్పెక్స్ కూడా Geekbench మీద ఆవిష్కరించబడ్డాయి. దీని ప్రకారంగా, ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క ఎక్సినోస్ 7870 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఈ ఫోన్, 3GB ర్యామ్ కలిగి, 16GB మరియు 32GB స్టోరేజిలలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ల విడుదలకంటే ముందుగానే, Android 9.0 Pie కి ఎప్పుడు అప్డేట్ కానున్నాయనే టైమ్ లైన్ ని ప్రకటించింది. దీని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 2019 నాటికల్లా ఆండ్రాయిడ్ 9.0 ఫై కి అప్డేట్ చేయబడతాయని తెలుస్తోంది.  

మూలాల ఆధారంగా, శామ్సంగ్ గెలాక్సీ M10 ధర Rs 8990 గా ఉండవచ్చని మరియు  గెలాక్సీ M20 ధర Rs 12,990 గా ఉండవచ్చని తెలుసుకున్నాము.  ఇది జనవరి 28 న స్మార్ట్ ఫోన్ల యొక్క విడుదల గురించిన బ్యానరును అమేజాన్ ఇండియా ఇప్పటికే చూపిస్తోంది.         

ఇక ఈ శామ్సంగ్ గెలాక్సీ M20 ఫోన్ కొన్ని ప్రత్యేకమైన స్పెక్స్ తో ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ -V డిస్ప్లే అని పిలిచే డిస్ప్లేతో రానుంది. అయితే, ఇది మరేమికాదు వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే . కానీ, శామ్సంగ్ నుండి రానున్న మొదటి నోచ్ గా ఇది ఉంటుంది. అలాగే, ఇది 13MP 1.12um పిక్సెల్ సైజు సెన్సారుతో జతగా 5MP డెప్త్ సెన్సార్, పోర్ట్రైట్ వంటివాటికి సహకరిస్తుంది. ఈ ఫోనులో, ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీని తీసుకొచ్చింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo