అదిరిపోయే ఫీచర్లు కానీ ప్రీమియం సెగ్మెంట్లో బడ్జెట్ ధర : శామ్సంగ్ గెలాక్సీ S10E ప్రత్యేకలు మరెన్నో
శామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ త్రయాన్ని విడుదల చేసింది
శామ్సంగ్ శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన విడుదల కార్యక్రమంలో, శామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ త్రయాన్ని విడుదల చేసింది. ఇందులో శామ్సంగ్ గెలాక్సీ S10E ని ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా విడుదల చేసింది. ఇది ఒక 5.8-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఇది HDR10 + సర్టిఫికేట్ను సూచించే డైనమిక్ AMOLED బ్రాండింగ్ను కలిగి ఉంది. ఇది ఒక 19: 9 యాస్పెక్ట్ రేషియోతో FullHD + స్పష్టత ఇస్తుంది. వెనుకవైపు, మూడుకు బదులుగా రెండు కెమెరాలు ఉన్నాయి – 77-డిగ్రీ ఫీల్డ్ వ్యూ తో వైడ్ -యాంగిల్ 12MP సెన్సార్ మరియు 123-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో ఉన్న మరొక ఆల్ట్రా-వైడ్ 16MP ఫిక్స్డ్ ఫోకస్ సెన్సర్. ముందు భాగంలో ఒక 10MP సెల్ఫీ షూటర్ కుడి ఎగువ మూలలో డిస్ప్లేలో విలీనం చేయబడింది.
గెలాక్సీ S10E కూడా ఇన్ -డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును దాటవేస్తుంది, పక్క మౌంటెడ్ కోసం మాత్రం స్థిరపడటానికి ఎంచుకుంది.
ఇది గ్లోబల్ మార్కెట్లలో శామ్సంగ్ ఎక్సినోస్ 9820 మరియు U. S మార్కెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 వంటి హార్డ్వేర్ను కలిగి ఉంది. ఇది 128GB లేదా 256GB అంతర్గత స్టోరేజితో, 6GB మరియు 8GB RAM వేరియంట్లలో అందించబడుతుంది. అయితే, మెమోరిని పంచుకునే అవకాశం మాత్రం ఇందులో లేదు.
గెలాక్సీ S10E వైర్లెస్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ని కలిగి ఉంది. దీన్ని తేలికగా ఉంచడానికి, ఇందులో ఒక 3100mAh బ్యాటరీని అందించారు.
ఈ గెలాక్సీ S10E – ప్రిస్మ్ వైట్, ప్రిస్మ్ బ్లాక్, ప్రిస్మ్ గ్రీన్, ప్రిస్మ్ బ్లూ, కానరీ ఎల్లో, ఫ్లెమింగో పింక్ వంటి రంగు ఎంపికలతో లభిస్తుంది.
లభ్యత మరియు ధర
శామ్సంగ్ ప్రకటించిన గెలాక్సీ S10 , గెలాక్సీ S10 + మరియు గెలాక్సీ S10E మూడు స్మార్ట్ ఫోన్లు కూడా, ఫిబ్రవరి ప్రారంభంలో ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. US లో, ఈ ఫోన్ల యొక్క షిప్పింగ్ మార్చి 8 న ప్రారంభమౌతుంది.
గెలాక్సీ S10 యొక్క అన్లాక్ వెర్షన్ $ 899 (దాదాపు రూ. 63,900) నుండి ప్రారంభమవుతుంది, గెలాక్సీ S10 + $ 999 నుండి (దాదాపు రూ. 71,000) మొదలవుతుంది. ఇక, గెలాక్సీ S10E $ 749.99 నుండి మొదలవుతుంది (దాదాపు Rs. 53,300).
భారతదేశంలో వీటి ధరలు మరియు వీటి లభ్యత వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.