Tizen OS ను ఎక్పాండ్ చేసే యోచనలో సామ్సంగ్
బంగ్లాదేశ్ లో ఒక మిలియన్ Tizen ఫోనులు అమ్ముడయ్యాయి.
సామ్సంగ్ తన సొంత ఆపరేటింగ్ సిస్టం ను మరింత ఎక్పాండ్ చేసేందుకు ప్లేన్స్ వేస్తుంది. 2015 సంవత్సరం జనవరి నెలలో సామ్సంగ్ Z1 పేరుతో Tizen ఆధారిత స్మార్ట్ ఫోన్ మొట్ట మొదటిగా లాంచ్ అయ్యింది.
ప్రస్తుతానికి స్మార్ట్ వాచ్ మరియు టీవీ లలో ఉన్న ఈ OS వచ్చే సంవత్సరంలో ఎక్కువ మొబైల్స్ లో కనిపించనుంది. జనవరి లో లాంచ్ అయిన టైజన్ స్మార్ట్ ఫోన్ ఒక మిలియన్ యూనిట్లను ను సేల్ చేసుకుంది అని సామ్సంగ్ చెబుతుంది. శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లో ఈ ఫోన్ పాపులర్ కూడా.కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం సామ్సంగ్ Z1, బాంగ్లాదేశ్ లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్.
గూగల్ మరియు సామ్సంగ్ రిలేషన్ షిప్ తో టైజెన్ ఆధారిత ఫోనులను వివిధ బడ్జెట్ సెగ్మెంట్ లలో లాంచ్ చేసి మార్కెట్ ను పెంచటానికి సామ్సంగ్ ప్రయత్నం. ఇది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. అయితే ఎన్ని గొప్ప ఫీచర్స్ లేదా లుక్స్ తో Tizen OS వచ్చినా, మార్కెట్ లో నిలబడాలి అంటే ఆండ్రాయిడ్ కు ఉన్నంత యాప్ ఎకో సిస్టం సంపాదించు కుంటే కాని ఇది యూజర్స్ ను ఆకర్షించటం కష్టం.