Samsung యొక్క ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందే లీక్…

Samsung యొక్క ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందే లీక్…

శామ్సంగ్ SM-W2018 స్మార్ట్ఫోన్ యొక్క ఫోటోలు ఆన్లైన్లో కనిపించాయి, దీనిని బట్టి  కంపెనీ  గత సంవత్సరం W2017 ఫ్లిప్ ఫోన్  యొక్క సక్సెసర్లో పనిచేస్తుందని తెలిసింది.
రాబోయే శామ్సంగ్ SM-W2018 ఫ్లిప్ ఫోన్ చైనీస్ టిప్స్టర్ చేత పోస్ట్ చేయబడిన ఫోటోల రూపంలో కనిపిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ అత్యంత ప్రీమియమ్ ఫ్లిప్ ఫోన్ గా చెప్పవచ్చు మరియు సూపర్ AMOLED ప్యానెల్లతో డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది . ఈ ఫోన్లో 6GB RAM మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ ఉన్నాయి.శామ్సంగ్ మరియు LG రెండు స్మార్ట్ఫోన్ తయారీదారులు, ఇప్పటికీ ఫ్లిప్ ఫోన్లు తయారు చేస్తున్నారు , కానీ వారు ఎక్కువగా చైనీస్ మార్కెట్ పరిమితం అవుతున్నారు . కొరియన్ స్మార్ట్ఫోన్ తయారీదారు  యొక్క చివరి ఫ్లిప్ స్మార్ట్ఫోన్ శామ్సంగ్ G-9298. అయితే, శామ్సంగ్ SM-W2018 ఫ్లిప్  ఫోన్ యొక్క అన్ని స్పెక్స్  గురించి ఇంకా  తెలియదు.

లీక్ ఇమేజ్ ఈ ఫోన్ ఒక మెటల్ బాడీ  కలిగి ఉంటుంది అని చూపిస్తుంది. ఈ ఫోన్ ఒకే వెనుక కెమెరా కలిగి ఉంటుంది మరియు ఫింగర్ ప్రింట్  సెన్సార్ కెమెరా ప్రక్కన ఉంటుంది. మరియు శామ్సంగ్ SM-W2018 చైనా లో మొదటి ప్రారంభించనున్నట్లు సమాచారం ,పుకార్ల ప్రకారం  సుమారు $ 2,000  (సుమారు రూ .30,000) వరకు ఉంటుంది . 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo