Samsung Galaxy Z Fold 6: ప్రీమియం కాదు అంతకు మించి ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
Samsung Galaxy Z Fold 6 ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది
ఈ ఫోన్ ను ప్రీమియం కాదు అంతకు మించి ఫీచర్స్ తో లాంచ్ చేసింది
1TB హెవీ అంతర్గత మెమరీతో పాటు Gemini AI వంటి భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది
Samsung Galaxy Z Fold 6: శామ్సంగ్ గెలాక్సీ Z సిరీస్ నుంచి ఫోల్డ్ 6 5జి ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను ప్రీమియం కాదు అంతకు మించి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 3 మరియు 1TB హెవీ అంతర్గత మెమరీతో పాటు Gemini AI వంటి భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని ఫీచర్స్ వరకూ ఆపాదమస్తకం అద్భుతం అనిపించేలా శామ్సంగ్ ఈ ఫోన్ ను అందించింది.
Samsung Galaxy Z Fold 6: ఫీచర్లు
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ లో పెద్ద 7.6 ఇంచ్ మెయిన్ స్క్రీన్ వుంది. ఇది QXGA+ రిజల్యూషన్ కలిగిన డైనమిక్ AMOLED 2X ఈ స్క్రీన్ మరియు ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫోల్డ్ 6 లో 6.3 ఇంచ్ కవర్ స్క్రీన్ వుంది. ఇది HD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ మరియు ఇది కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.
ఈ ఫోన్ ను ఆర్మోర్ అల్యూమినియం బాడీ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణతో అందించింది. ఈ ఫోన్ చూడడానికి ముందుగా వచ్చిన ఫోల్డ్ ఫోన్స్ మాదిరిగా కనిపించినా, చాలా స్లీక్ గా వుంది మరియు మైనర్ చేంజెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లోపలికి వెళితే, ఈ ఫోన్ లో క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ వుంది. దీనికి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 1TB హెవీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ చాలా AI-powered ఫీచర్స్ తో వస్తుంది మరియు ఇంటిగ్రేటెడ్ Gemini APP తో ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ సెటప్ కెమెరా వుంది. ఇందులో, 12MP అల్ట్రా వైడ్ + 50MP వైడ్ యాంగిల్ + 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఇది 30x స్పేస్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్ మరియు AI సూపర్ రిజల్యూషన్ టెక్నాలజీ కలిగిన 10x డిజిటల్ జూమ్ లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ కవర్ డిస్ప్లేలో 10MP సెల్ఫీ కెమెరా మరియు మెయిన్ స్క్రీన్ లో 4MP అండర్ డిస్ప్లే కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 8K UHD వీడియోలు మరియు AI సపోర్ట్ తో గొప్ప ఫోటోలు పొందవచ్చు. ఇందులో, AI ఆధారిత ప్రో విజువల్ ఇంజన్, ఫోటో అసిస్ట్, పోర్ట్రైట్ స్టూడియో మరియు Instant Slo-Mo వంటి చాలా AI కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Lava Blaze X: చవక ధరలో 3D Curved AMOLED స్క్రీన్, 64MP Sony కెమెరాతో వచ్చింది.!
ఈ ఫోన్ లో 4,400mAh డ్యూయల్ బ్యాటరీ వుంది మరియు ఇది వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ ఫోన్ IP48 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ శామ్సంగ్ ఫోల్డ్ ఫోన్ రెండు nano SIM మరియు మల్టీ eSIM సపోర్ట్ లతో వస్తుంది. ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ OneUI 6.1.1 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 OS తో వస్తుంది. ఈ ఫోన్ సిల్వర్ షాడో, పింక్ మరియు మింట్ కలర్ లలో లభిస్తుంది. అయితే, క్రాఫ్టెడ్ బ్లాక్, వైట్ మరియు పీచ్ అనే మూడు ఎక్స్ క్లూజివ్ కలర్స్ కూడా ఉన్నాయి.
Samsung Galaxy Z Fold 6: Price
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ మూడు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ ధరలు క్రింద చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : (12GB + 256GB) వేరియంట్ ధర రూ. 1,64,999
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : (12GB + 512GB) వేరియంట్ ధర రూ. 1,79,999
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : (12GB + 1TB) వేరియంట్ ధర రూ. 2,00,999
Pre Book ఆఫర్స్:
శామ్ సంగ్ ఈ ఫోల్డ్ ఫోన్ ను భారీ ఆఫర్లతో జతగా ప్రకటించింది. ఈ ఫోన్ పైన రూ. 8,000 రూపాయల బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించింది. అలాగే, రూ. 999 రేటుకే రూ. 14,999 విలువైన స్క్రీన్ రీప్లీసెమెంట్ ఆఫర్ జత చేసింది.
సేల్
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ Pre Orders ను ఈరోజు మొదలు పెట్టింది మరియు ఈ ఫోన్ జూలై 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.