Samsung Galaxy Z Flip 6: కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది.!

Updated on 10-Jul-2024
HIGHLIGHTS

Galaxy Unpacked’ నుంచి ఫ్లిప్ 6 ఫోన్ ను విడుదల చేసింది

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్ మరియు AI సపోర్ట్ తో వచ్చింది

ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది

Samsung Galaxy Z Flip 6: ఈరోజు శామ్సంగ్ నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ ‘Galaxy Unpacked’ నుంచి ఫ్లిప్ 6 ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ డైనమిక్ AMOLED 2X మెయిన్ స్క్రీన్, పెద్ద కవర్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్ మరియు AI సపోర్ట్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లో అందించిన కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy Z Flip 6: స్పెక్స్ మరియు ఫీచర్లు

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్ ఫోన్ ను కూడా Galaxy Z Fold 6 మాదిరిగానే క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 పవర్ ఫుల్ చిప్ సెట్ తో అందించింది. ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను జత చేసింది. ఈ రెండు విషయాలు చాలు ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి. Z ఫ్లిప్ 6 కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ OneUI 6.1.1 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 OS తో పని చేస్తుంది.

Samsung Galaxy Z Flip 6

ఈ ఫోన్ స్క్రీన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మడత పెట్టగల 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2x స్క్రీన్ వుంది. ఇది FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 3.4 ఇంచ్ కవర్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED స్క్రీన్ మరియు ఇది 306 PPI తో ఉంటుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ ఫోన్ కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ శామ్సంగ్ ఫోల్డ్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP వైడ్ యాంగిల్ డ్యూయల్ పిక్సెల్ AF సెన్సార్ మరియు 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లో 10MP ఫ్రెంట్ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 4K UHD వీడియోలు మరియు AI పవర్డ్ ఫోటోలు చిత్రించే అవకాశం వుంది.

Also Read: Samsung Galaxy Z Fold 6: ప్రీమియం కాదు అంతకు మించి ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

ఈ ఫోన్ 4000mAh డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది మరియు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ Nano SIM సపోర్ట్ మరియు eSIM సపోర్ట్ వుంది. ఈ ఫోన్ సిల్వర్ షాడో, ఎల్లో, బ్లూ మరియు మింట్ నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Samsung Galaxy Z Flip 6: ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 1,09,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ (12GB + 512GB) ను రూ. 1,21,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ Pre Orders ను ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే, జూలై 24 నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

Pre Order ఆఫర్స్

శామ్ సంగ్ ఈ ఫ్లిప్ ఫోన్ ను ఆకర్షణీయమైన ఆఫర్లతో జతగా లాంచ్ చేసింది. బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 8,000 క్యాష్ బ్యాక్ అందుతుంది. ఈ ఫోన్ తో రూ. 999 చెల్లింపుతో రూ. 9,999 రూపాయల విలువైన స్క్రీన్ లేదా పార్ట్స్ రిప్లేస్మెంట్ ఫెసిలిటీ అంధిస్తుంది. ఈ ఫోన్ పైన 9 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :