సామ్సంగ్ ఫోల్డ్ చేయగలిగే స్మార్ట్ ఫోన్ తయారు చేస్తునట్లు కొన్ని రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ మనం ఫ్లిప్ ఫోనులు చూడటం జరిగింది కదా, ఈ foldable ఫోన్స్ వాటికి replacement అని తెలుస్తుంది.
సామ్సంగ్ రీసెంట్ గా ఫోన్ మధ్యకు ఫోల్డ్ చేయగలిగే patent ను పబ్లిష్ చేయటం వలన ఈ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. 2017 లో మార్కెట్ లోకి కూడా ఎంటర్ అవనున్నాయి అని అంచనా.
folding అనేది సెమి ఆటోమాటిక్ అని గతంలో గాలక్సీ క్లబ్ వెబ్ సైట్ లో రిలీజ్ అయిన నమూనా పై కంపెని అఫీషియల్ గా కామెంట్ కూడా చేసింది.
ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ UK రిపోర్ట్స్ ప్రకారం ఇది Galaxy X అనే పేరుతో వస్తుంది. అయితే ఇలాంటి bend అయ్యే స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ లో గతంలో కూడా చాలా వినిపించాయి..
కానీ అవి నిజంగా మార్కెట్ లో రిలీజ్ వరకూ రాలేకపోయాయి. మరి సామ్సంగ్ రీసెంట్ గాలక్సీ S7 నోట్ లో ఫెయిల్ అవటం వలన వీటిపై సీరియస్ గా పనిచేసి మార్కెట్ దృష్టి ని మరలా సంపాదించుకునే ప్రయత్నం చేస్తుందేమో.