Samsung Galaxy S9 అండ్ S9+ ఇండియాలో ప్రీ-ఆర్డర్ కోసం లభ్యం ,అడ్వాన్స్ పేమెంట్ Rs 2,000

Updated on 27-Feb-2018

ఈ హ్యాండ్సెట్లు మార్చి 16 నుండి US లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది, అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్లు ఇండియాలో  ప్రధాన ప్రీ-ఆర్డర్స్కు అందుబాటులో ఉన్నాయి, దీని కోసం వినియోగదారులకు రు. 2,000 ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్స్  ప్రీ  బుకింగ్ అనేది కొన్ని కొద్ది శామ్సంగ్ దుకాణాలలో అందుబాటులో ఉంది. కస్టమర్ దుకాణానికి వెళ్లి, 2,000 ప్రీ-బుకింగ్ మొత్తం చెల్లించాలి. వినియోగదారుడు వారి పేరు, ఇమెయిల్-ఐడి మరియు ఫోన్ నంబర్ మొదలైన వాటికి ఇవ్వవలసి ఉంటుంది.

MWC 2018 లో, శామ్సంగ్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ప్రవేశపెట్టింది – గెలాక్సీ S9 మరియు గెలాక్సీ S9 ప్లస్. గెలాక్సీ S9 మరియు S9 + మార్చి 2018 నుండి మిడ్నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ మరియు పర్పుల్  కలర్స్ లో అందుబాటులో ఉంటాయి.

Galaxy S9 లో 5. 8 ఇంచెస్ క్వాడ్ HD + కర్వ్డ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే కలదు. S9+ లో  6.2-అంగుళాల క్వాడ్ HD + కర్వ్డ్  సూపర్ AMOLED డిస్ప్లే  కలదు . రెండు ఫోన్స్ IP68- సర్టిఫైడ్ . 

Galaxy S9  లో సింగల్ రేర్ కెమెరా , అలానే  S9+ లో డ్యూయల్ రేర్ కెమెరా కలవు .  రెండు ఫోన్స్  8MP ఫ్రంట్ కెమెరా కలిగి వున్నాయి .

గెలాక్సీ S9 లో 4GB RAM తో 64GB / 128GB / 256GB  స్టోరేజ్ ఆప్షన్స్ ను కలిగి ఉంది మరియు  స్టోరేజ్  మైక్రో SD కార్డ్ ద్వారా 400GB కు విస్తరించబడుతుంది. అదేవిధంగా, S9 + 6GB RAM తో 64GB / 128GB / 256GB నిస్టోరేజ్ ఆప్షన్స్ ను కలిగి ఉంది, స్టోరేజ్  మైక్రో SD కార్డ్ ద్వారా 400GB కి పెంచబడుతుంది.

గెలాక్సీ S9 3000mAh బ్యాటరీని కలిగి ఉంది, అయితే S9 + 3500 mAh బ్యాటరీ  కలిగి ఉంటుంది. రెండూ ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్కు మద్దతు ఇస్తాయి.

 

Connect On :