శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ డివైసెస్ S8 మరియు S8 స్మార్ట్ ఫోన్స్ ధరలో నవరాత్రి కి ముందుగానే 4,000 రూపాయలు కట్ చేయటం జరిగింది . హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులు ఈ డివైస్ కొనుగోలు చేస్తే రూ .4,000 ల క్యాష్ బ్యాక్ ను పొందుతారు.
హెచ్డిఎఫ్సి కార్డు హోల్డర్లు గెలాక్సీ ఎస్ 8 ప్లస్ (128 జీబి వేరియంట్ ) ఫై 4,000 వేల రూపాయలు క్యాష్ బ్యాక్ తో పాటుగా 1,000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చును . ఇటీవలే విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ఏకంగా 2.5 లక్షల ప్రజల నుంచి రిజిస్ట్రేషన్ పొందింది. మరియు గెలాక్సీ నోట్ 8 అమెజాన్ లో 1.5 మిలియన్ రిజిస్ట్రేషన్లను పొందింది.
శామ్సంగ్ ఇండియా వెబ్సైట్లో సుమారు 1 లక్షల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు.అమెజాన్ ఈ సోమవారం నోట్ 8 యొక్క ప్రీ ఆర్డర్స్ మరొకసారి స్టార్ట్ చేసింది . ఇది సెప్టెంబర్ 21 నుండి సరఫరా చేయబడుతుంది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ జిఎఫ్ కె ప్రకారం, స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో 43 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ ఇండియాలో టాప్ లో ఉంది.
గాలక్సీ S8, గాలక్సీ S8 ప్లస్ లానే నోట్ 8 లో కూడా 'ఇన్ఫినిటీ డిస్ప్లే ' కలదు దీని ఎస్పెక్ట్ రేషియో 18.5:9 .దీనిలో 6.3 ఇంచెస్ సూపర్ అమోల్డ్ స్క్రీన్ ఉంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో శామ్సంగ్ యొక్క మొదటి స్మార్ట్ఫోన్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ తో ఉంటుంది