రీసెంట్ గా గేలక్సీ నోట్ 7 వరుస పేలుడుల కారణంగా సామ్సంగ్ ఈ ఫోన్ ను పూర్తిగా నిలిపివేసింది. అంటే తయారీ ఉండదు, సేల్స్ ఉండవు. కొన్నవారి నుండి మనీ refund లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంది.
ఇలాంటి ఘోర పరాజయలను చూసిన కంపెని ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఎలా తీసుకువస్తుంది అనేది ఇంటరెస్టింగ్ గా ఉంది మార్కెట్ లో.
Dutch దేశంలోని వెబ్ సైట్ TechTastic ప్రకారం నెక్స్ట్ రాబోయే అప్ కమింగ్ గేలక్సీ S8 లో 6GB రామ్, 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంటుంది అని తెలుస్తుంది.
అయితే ఆల్రెడీ 6GB రామ్ తో oneplus అండ్ ఇతర ఫోనులు ఉన్నాయి. వాటిలో ఆల్రెడీ oneplus 3 బాగా సక్సెఫుల్ గా రన్ అవుతుంది.
సో ఈ నేపధ్యంలో వినిపిస్తున్న వార్త – కంపెని గేలక్సీ S8 ను రెండు వేరియంట్స్ లో రిలీజ్ చేస్తుంది, మరొకటి 8GB రామ్ తో ఉంటుంది అని అంచనా.