శాంసంగ్ గాలక్సీ s 8 గురించి బహిర్గతమైన కొత్త లీక్
ఈ రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ మార్చ్ 29 వ తారీఖు న లాంచ్ అవ్వబోతున్నాయి
శాంసంగ్ గాలక్సీ s 8 గురించి బహిర్గతమైన కొత్త లీక్
ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ వారి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ అయిన శాంసంగ్ గాలక్సీ s 8 మరియు s 8 ప్లస్ యొక్క కొత్త ఫొటోస్ మరలా లీక్ అయ్యాయి. ఈ రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ మార్చ్ 29 వ తారీఖు న లాంచ్ అవ్వబోతున్నాయి. ఈ ఫోన్స్ డిసైన్ మరియు ఫీచర్స్ గురించి ఇంతకు ముందే అనేక వార్తలు వచ్చాయి. లీక్ అయిన ఫొటోస్ ప్రకారం చూసినట్లయితే గాలక్సీ s 8 లో పెద్ద స్క్రీన్ తో పాటుగా డ్యూయల్ క్వార్డ్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు సమాచారం. మరియు s 8 లో 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగి వుంది.
లీక్స్ అనుసారం s 8 యొక్క రెసొల్యూషన్ 1440 X 2960p గా ఉంది. దీని కంటే ముందు మనం LG G6 లో 18:9 ఆస్పెక్ట్ రేషియో ను చూసాము . డివైస్ యొక్క బాటమ్ లో ఆన్ స్క్రీన్ నావిగేషన్ బటన్ కలిగి వుంది. ఫోన్ యొక్క కుడి వైపున వాల్యూమ్ కంట్రోల్ మరియు పవర్ బటన్లు పొందుపరచబడి వున్నాయి. మరియు ఫొటోస్ లో గాలక్సీ s 8 యొక్క ఫ్రంట్ ప్యానెల్ స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రంట్ ప్యానెల్ లో ఫిజికల్ బటన్ అస్సలు లేదు. అంటే యూజర్ అవసరాలు ప్రకారం ఆన్ స్క్రీన్ కంట్రోల్స్ ను కస్టమైజ్ చేయవచ్చు. గెలాక్సీ S8 లో 835 స్నాప్డ్రాగెన్ ప్రాసెసర్ ఉంది. అలాగే s 8 ఫోన్లో 5.8 ఇంచెస్ మరియు s 8 ప్లస్ లో 6.2 ఇంచెస్ qHD సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఉంది, . రెండింటిలోనూ IP 68 సాంకేతికత కలిగి ఉండటం వలన వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటాయి.
s 8 లో కొన్ని రూమర్స్ ప్రకారం ఈ ఫీచర్ వాయిస్ కమాండ్ ఫై పని చేస్తుంది మరియు యూజర్ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మరియు 4 జీబీ రామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి వుంది. అందిన సమాచారం ప్రకారం s 8 లో 3000 M A h బ్యాటరి మరియు s 8 ప్లస్ లో 3500M A h బ్యాటరి కలిగి వున్నాయి. మరియు 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ముందు కెమెరా, 5 మెగాపిక్సెల్ గా వున్నాయి. మరియు వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా పొందుపరచబడి వుంది. మరియు రెండింటిలోనూ బయోమెట్రిక్ అతేంటిక్షన్ ఫీచర్ ఉనికిలో ఉంటుంది. ఈ రెండు డివైసెస్ మార్చ్ 29 వ తారీఖు న లాంచ్ అవ్వబోతున్నాయి. మరియు ఇండియా టైం ప్రకారం రాత్రి 9. 30 గంటలకు లాంచ్ అవుతాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile