రిపోర్ట్స్ ప్రకారం సామ్సంగ్ తన తాజా సకేస్ఫుల్ మోడల్ గెలాక్సీ S6 మోడల్ తో రెండు డిఫెరెంట్ మోడల్స్ ను లాంచ్ చేయనుంది. ఒకటి సామ్సంగ్ గేలక్సీ S6 యాక్టివ్ మరొకటి S6 ప్లస్. ఈ రెండు ఒరిజినల్ S6 కన్నా బెటర్ గా ఉంటాయి అని టాక్.
S6 రగ్గడ్ వాటర్ ప్రూఫ్ బాడీ తో రానుంది. 5.1 QHD సూపర్ ఆమోలేడ్ + 2560 x 1440 పిక్సెల్స్ డిస్ప్లే తో ఉండే అవకాశాలు ఉన్నాయి. 3జిబి ర్యామ్ Exynos 7420 ఆక్టో కోర్ ప్రాసెసర్, 32 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 16MP మరియు 5MP కెమేరా, అదనపు స్టోరేజ్ కార్డ్ సపోర్ట్, బిగ్గర్ బ్యాటరీ, ఫిసికల్ బటన్స్ మరియు S6 కన్నా ఎక్కువ సైజు లో రావచ్చు అని అంటున్నారు. అయితే ఈ మోడల్ లో ఫింగర్ ప్రింట్ మరియు హార్ట్ రేట్ మానిటర్ ఉండవు.
గేలక్సీ S6 ప్లస్ లో 5.5 in సూపర్ అమోలేడ్ కర్వ్ద్ డ్యూయల్ ఎడ్జ్ డిస్ప్లే ఉండనుంది. హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్ తో పవర్ ఫుల్ ప్యాక్ గా రానుంది అని రిపోర్ట్స్. అయితే దీనిలో S – Pen ఫంక్షనాలిటీ తప్పితే మిగతా వన్నీ S6 మాదిరిగానే ఉండనున్నాయి.
సామ్సంగ్ ప్రాజెక్ట్ జెన్ పేరుతో S6 ప్లస్ పై సామ్సంగ్ ఎప్పటి నుండో వర్క్ చేస్తుంది అని రిపోర్ట్స్. కొన్ని వారాల్లో రిలీజ్ చేయనున్న S6 ప్లస్ సామ్సంగ్ గెలాక్సీ గత మోడల్స్ S4 మరియు S5 లోని లోపాలను దృష్టిలో పెట్టుకొని ఇందులో అవి ఓవర్ కమ్ చేసి తయారు చేస్తున్నారట. ఈ విషయాల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాలి.
ఆధారం: TechRadar