Samsung Galaxy S24 FE: AI ఫీచర్స్ మరియు సూపర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy S24 FE: AI ఫీచర్స్ మరియు సూపర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

Samsung Galaxy S24 FE స్మార్ట్ ఫోన్ ను శామ్సంగ్ లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను కూడా AI ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ స్లీక్ డిజైన్, స్టన్నింగ్ లుక్స్ మరియు గొప్ప కెమెరా సెటప్ తో వచ్చింది

Samsung Galaxy S24 FE స్మార్ట్ ఫోన్ ను శామ్సంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ S24 సిరీస్ నుంచి ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే ఈ ఫోన్ ను కూడా AI ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్, స్టన్నింగ్ లుక్స్ మరియు గొప్ప కెమెరా సెటప్ కూడా వచ్చింది. శామ్ సంగ్ సరికొత్తగా విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy S24 FE: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ ను కంపెనీ యొక్క సొంత చిప్ సెట్ Samsung Exynos 2400e తో తీసుకు వచ్చింది. ఈ చిప్ సెట్ 3.1GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది మరియు ఇది డెకా కోర్ చిప్ సెట్. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 16M కలర్ డెప్త్ తో వస్తుంది. ఈ ఫోన్ 8K రిజల్యూషన్ వీడియో ప్లే సపోర్ట్ తో కూడా వస్తుంది.

Samsung Galaxy S24 FE

ఈ ఫోన్ లో గొప్ప ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి మరియు 10MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 30fps వద్ద UHD 8K (7680 x 4320) రిజల్యూషన్ తో వీడియోలను షూట్ చేయవచ్చని శామ్సంగ్ తెలిపింది. అంతేకాదు, 120fps వద్ద UHD స్లోమోషన్ వీడియో లను షూట్ చేయవచ్చని కూడా శామ్సంగ్ పేర్కొంది.

Also Read: Flipkart Sale: LED రేటుకే లభిస్తున్న బ్రాండెడ్ బిగ్ Mini LED స్మార్ట్ టీవీ.!

శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ 4700 mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, ఎల్లో, మింట్ మరియు గ్రే కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ ఫోన్ ఆర్డర్స్ మొదలవుతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo