Samsung Galaxy S24 FE స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ లీక్డ్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో వస్తుంది మరియు ఎటువంటి డిజైన్ ను కలిగి ఉంటుందో తెలుసుకోవడానికి స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా మాకు చూపుతున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త లీక్డ్ వీడియో ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ ను వెల్లడిస్తోంది. ఈ కొత్త పీడిత మరియు ఈ లీక్డ్ వీడియో విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ వీడియో Evan Blass X అకౌంట్ (గతంలో ట్విట్టర్) నుంచి లీక్ అయ్యింది. ఒక చిన్న వీడియో క్లిప్ నుంచి నుంచి శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఆన్ బాక్స్ ను వివరించింది. ఈ వీడియో క్లిప్ ద్వారా గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అర్థం అవుతున్నాయి.
శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీక్డ్ వీడియో లో ఈ ఫోన్ బాక్స్ లో లభించే వస్తువులు చూపించింది. దీని ప్రకారం, ఈ ఫోన్ బాక్స్ లో స్మార్ట్ ఫోన్, SIM ఎజెక్టర్, USB-C కేబుల్ మరియు క్విక్ యూజర్ గైడ్ ఉన్నాయి. ఇక ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్ట్రాంగ్ అల్యూమినియం బాడీ మరియు గ్లాసీ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం మరియు ముందు ఔఞ్చ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.
ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ మరియు 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ వీడియోలో 17cm స్క్రీన్ సైజును సూచించింది మరియు ఇది 6.7 ఇచ్న్హ సైజుకు సమానం అవుతుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క లేటెస్ట్ సొంత చిప్ సెట్ Exynos 2400e తో అందించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లో 4700mAh బ్యాటరీ అందిస్తుందని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
Also Read: Flipkart సూపర్ డీల్: కేవలం రూ. 18,490 కే షియోమీ పెద్ద Smart Tv ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
వీడియోలో కేవలం కెమెరా సెటప్ ను మాత్రం చూపించగా, ఈ సెటప్ లో ఉండే సెన్సార్ లను కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లో 50MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో సెన్సార్ లు ఉండవచ్చని ఊహిస్తున్నారు.
ఈ విషయాలు మాత్రమే ప్రస్తుతానికి శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ గురించి బయటకు వచ్చాయి. మరిన్ని శామ్సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్ ఫోన్ అప్డేట్ లతో మళ్ళి కలుసుకుందాం.