ఇన్ఫినిటీ డిస్ప్లేమరియు డ్యూయల్ కెమెరాతో కూడిన శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8ని రూ. 16,990 గా ఇండియాలో లాంచ్ చేయనుంది 2018
శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8 ఆగస్టు 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ మరియు శామ్సంగ్ ఆన్లైన్ దుకాణాలలో అందుబాటులో ఉంటుంది.
మిడ్-రేంజ్ సెగ్మెంట్లో దాని పట్టును పటిష్టపరచడానికి శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8 ను 'ఇన్ఫినిటీ డిస్ప్లే' తో మరియు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) తో వెనుక డ్యూయల్ – కెమెరాలతో ప్రారంభించింది. వినియోగదారులు ఇమేజ్ లోని ముందు మరియు బ్యాగ్రౌండ్ నేపథ్యంతో టింకర్ ని చేసే వీలుంది AI సహాయంతో తద్వారా "ప్రొఫెషనల్ గ్రేడ్" ఛాయాచిత్రాలను అందించడానికి వీలవుతుంది. ఈ గెలాక్సీ ఆన్ 8 ఫోన్ ఆన్లైన్ ప్రత్యేకంగా అందించనున్నారు ఇది ఫ్లిప్ కార్ట్ మరియు శామ్సంగ్ ఆన్లైన్ దుకాణాలలో ఆగష్టు 6 నుండి లభిస్తుంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8 పరిచయ ధర కింద రూ. 16,990 మరియు ఏవిధమైన ఇఎమ్ఐ లేకుండా, ప్రత్యేక డేటా ఆఫర్ తో పాటుగా అందనుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 8 స్పెసిఫికేషన్లు : కంపెనీ ఈ ఫోన్ ని పరిశ్రమ-మొదటి, AI- శక్తితో పనిచేసే డ్యూయల్ – కెమేరా ఫీచర్ తో వచ్చినట్లు పేర్కొంది. ఫోన్ వెనుక భాగంలో f / 1.7 ఎపర్చరుతో 16ఎంపీ సెన్సార్ ని కలిగి ఉంటుంది. రెండవ కెమెరాగా f / 1.9 5ఎంపీ లెన్స్ అపేర్చేరు కలిగి ఉంటుంది. ముందుభాగంలో f / 1.9 తో కూడిన తో కూడిన ఒక విలీన 16ఎంపీ కేమెరాని కలిగివుంది. ఫోన్ వెనుక భాగంలో ఉంచబడిన ఈ డ్యూయల్ -కెమెరా శామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ అయిన 'లైవ్ ఫోకస్' ఫీచర్ తో వినియోగదారులు తీసే ఫోటోలలో ముందువైపు అంశాల మీద ఫోకస్ చేసి బ్యాగ్రౌండ్ ని బ్లర్ చేసికొని అవకాశం వుంది. ఈ స్మార్ట్ ఫోన్ 18.5:9 యాస్పెక్ట్ రేషీతో కూడిన ఒక 6-అంగుళాల హెచ్ డి + సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్ప్లేకలిగివుంది. ఇన్ఫినిటీ డిస్ప్లే వలన డివైజ్ యొక్క మొత్తం పరిమాణాన్ని పెంచకుండా సుమారు 15 శాతం ఎక్కువ డిస్ప్లే భాగాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఆన్ 8 ఒక పాలికార్బోనేట్ యునిబాడీ మరియు ఆండ్రాయిడ్ ఒరెయో 8.0 OS తో నడుస్తుంది . ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు దీనిలో 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ (256జీబీ వరకు విస్తరించదగినది అదనపు స్టోరేజ్) ద్వారా వస్తుంది. ఇది ఒక పెద్ద 3,500 mAh బ్యాటరీని కలిగి ఉంది.
గెలాక్సీ ఆన్ 8 లో బ్లర్ ఆకారం, పోర్ట్రైట్ డాలీ మరియు పోర్త్రైట్ బ్యాక్ డ్రాప్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ బ్లర్ ఆకారంతో, వినియోగదారులు వివిధ సందర్భోచిత ఆకృతులలో సాఫ్ట్ లైట్ ఎఫెక్ట్ ని జోడించవచ్చు. సినిమాటిక్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం పోర్ట్రైట్ డాలీ ఫీచర్ బ్యాగ్రౌండ్ లో జూమ్ కదలికలతో ఒక కదిలే GIF చిత్రం అందిస్తుంది. పోర్ట్రైట్ బ్యాక్డ్రాప్ మోడ్ వినియోగదారులు ఫంకీ బ్యాగ్రౌండ్ ప్రభావాలను రూపొందించడానికి అనుమతిస్తుంది.
"శామ్సంగ్, మా ఉత్పత్తులు మరియు సేవలలో అర్ధవంతమైన ఆవిష్కరణను తీసుకురావడం అనేది మా స్థిర ప్రయత్నం మా వినియోగదారుల జీవితాలకు నిజంగా విలువను జోడించేదిగా వుంది . గెలాక్సీ ఆన్ 8 స్పోర్ట్స్ శామ్సంగ్ యొక్క సిగ్నేచర్ అయిన ఇన్ఫినిటీ డిస్ప్లే మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ ఫీచర్లు కలిగిన ఒక అద్భుతమైన పరికరం. గాలక్సీ ఆన్ 8 తో, కెమెరా గురించి మరింత వివరించి చెప్పాము, ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించిన ఫీచర్స్ లో ఇది ఒకటి, "అని శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ ఉపాధ్యక్షుడు సందీప్ సింగ్ అరోరా చెప్పారు.
'మేడ్ ఫర్ ఇండియా' లో భాగంగా శామ్సంగ్ "చాట్ ఓవర్ వీడియో" ఫీచర్ తో చాట్ చేస్తున్నప్పుడు వినియోగదారులు వీడియోలను చూడవచ్చు. ఈ లక్షణం స్మార్ట్ఫోన్లో కంటెంట్ ని వీక్షించేటప్పుడు వినియోగదారులు టైప్ చేసే విధంగా వీడియో పైకి కనిపించే పారదర్శక కీబోర్డును కలిగి ఉంటుంది. 'మేక్ ఫర్ ఇండియా' మరొక ఫీచర్ ద్వారా , శామ్సంగ్ మాల్, ఫోన్ లో ముందుగానే లోడ్ చేసివుంది . ఈ లక్షణం వినియోగదారులు ఇష్టపడే షాపింగ్ చిత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు షాపింగ్ చెయ్యటానికి మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో కావాల్సిన ప్రోడక్ట్ ఫలితాలను పొందడం కోసం AI లను ఉపయోగిస్తుంది.